జగన్, కేసీఆర్ ఒక్కటై నా ఫోన్ ట్యాప్ చేసారు : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ
జగన్, కేసీఆర్ ఒక్కటై నా ఫోన్ ట్యాప్ చేసారు : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ
ప్రజా క్షేత్ర్, అమలాపురం :
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శనివారం జరిగిన జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిళ మీడియాతో మాట్లాడారు. ముమ్మాటికీ నా ఫోన్ ట్యాఫింగ్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఒకటై ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని వైఎస్ షర్మిల ఆరోపించారు. రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్ళు అయినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాజధాని, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ అమలు జరగలేదని షర్మిళ విమర్శించారు. గత 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ప్రధాని మోడీ రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా కేడీ గా మారారని షర్మిళ ఆరోపించారు. రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం జిల్లాల పర్యటనల్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాల్లో పాల్గొని కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుంటున్నానని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు, కాంగ్రెస్ నాయకులు జంగా గౌతమ్, కేబీఆర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
మహిళా కార్యకర్త ఆవేదన....
నేను పార్టీ కోసం కోట్లు ఖర్చు పెట్టాను... నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేశారని ఒక మహిళా కార్యకర్త వైఎస్ షర్మిళ ముందు వాపోయారు . రామచంద్రాపురం మహిళా కాంగ్రెస్ నాయకురాలు ఇసుకపట్ల శ్యామల సమావేశంలో షర్మిళ ముందు తన గోడు వెళ్లబోసుకున్నారు.