జగన్ రెడ్డీ... ఖబడ్డార్ * : మంత్రి సవిత హెచ్చరిక

జగన్ రెడ్డీ... ఖబడ్డార్ *  : మంత్రి సవిత హెచ్చరిక

జగన్ రెడ్డీ... ఖబడ్డార్
* మంత్రి సవిత హెచ్చరిక
*సీఎం చంద్రబాబుపై నోరుజారితే తగిన గుణ పాఠం చెబుతామని హెచ్చరిక 

*నైతికంగా పతనమైన నాయకుడు జగన్

*రౌటీ షీటర్లకు పరామర్శతో అరాచకాలకు ప్రోత్సాహమిచ్చినట్లే.
 5 ఏళ్ల అసమర్థ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం

*దళితులను ఏనాడూ పట్టించుకోలేదు...

*ఉనికి కోసమే కుల, శవ రాజకీయాలు
* జగన్ పై మంత్రి సవిత విసుర్లు
*కూటమి ప్రభుత్వం అన్ని హామీలూ నెరవేస్తోంది...
* పథకాల అమలుపై చర్చకు సిద్ధమా :
మంత్రి సవిత సవాల్
ప్రజా క్షేత్ర్, అమరావతి :
 నీతి, నిజాయితీకి నిలువెత్తురూపమైన సీఎం చంద్రబాబునాయుడు గురించి నోటికొచ్చిన మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతాం... ఖబడ్డార్ జగర్ రెడ్డి అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత శాఖ మంత్రి సవిత హెచ్చరించారు. రౌడీ షీటర్లకు, గంజాయి గ్యాంగ్ కు పరామర్శ చేసి నైతికంగా పతనమైన రాజకీయ నాయకుడివని మండిపడ్డారు.  అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు జగన్ రెడ్డి రాజ్యాంగం, చట్టం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు సైతం జగన్ రెడ్డి మాటలను విని నవ్వుకుంటున్నారన్నారు. అయిదేళ్ల పాలనలో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలంటూ అన్ని వర్గాలనూ జగన్ మోసం చేశారన్నారు. దళితులను అన్ని విధాలా అన్యాయం చేశారన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారన్నారు. 2014-19లో అమలు చేసిన 27 పథకాలను, దళిత యువతకు స్వయం ఉపాధి పథకాలను నిలిపేశారని మండిపడ్డారు. జగన్ పాలనలో గతంలో ఎన్నడూ లేనంతగా దళితులపై దాడులు జరిగాయన్నారు. దళిత మహిళలపై అఘాయిత్యాలు సైతం చోటుచేసుకున్నాయన్నారు. ఇన్ని జరిగినా ఏనాడూ దళితులను పరామర్శించిన పాపాన జగన్ పోలేదన్నారు. మాస్క్ అడిగిన పాపానికి దళిత వైద్యుడు డాక్టర్ సుధాకర్ ను మానసికంగా హింసించి చంపారన్నారు. దళిత డ్రైవర్ ను డోర్ డెలవరీ చేసిన ఘనత కూడా వైసీపీ నాయకుడిదేనన్నారు. జగన్ కు కుల, శవ రాజకీయాలు చేయడం అలవాటైపోయిందని, అందుకే ఆయనను ప్రజలు పక్కనబెట్టారని అన్నారు. దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. జగన్ పరామర్శించిన వారి దాడిలో గాయపడిన కానిస్టేబుల్ కూడా దళితుడేనన్నారు. ఆయననెందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. అయిదేళ్లలో ఎంతమంది దళితులను జగన్ రెడ్డి పరామర్శించాడో చర్చించడానికి సిద్ధమా..? అని మంత్రి సవిత సవాల్ విసిరారు.