జల్సాల కోసం మోహన్ బాబు ఇంట్లో దొంగతనం..నిందితుడు అరెస్ట్
జల్సాల కోసం మోహన్ బాబు ఇంట్లో దొంగతనం..నిందితుడు అరెస్ట్
ప్రజాక్షేత్ర్, వెబ్ న్యూస్
నటుడు మోహన్ బాబు ఇంట్లో రూ.10లక్షలు కాజేసి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని పహాడిషరీప్ పోలీసులు అదుపులోకి తీసుకుని బుధవారం రిమాండ్‌కు తరలించారు. వివరాల లోకి వెళితే... జల్పల్లిలోని మంచు టౌన్ షిప్ కు చెందిన సినీనటుడు మోహన్‌బాబు ఇంట్లో గత ఆరు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాకు చెందిన ఎర్ర వంక పల్లి విలేజ్‌కు చెందిన వడితె గణేష్ నాయక్ (24) హౌజ్ బాయ్‌గా పనిలో చేరాడు. ఈ నెల 22వ తేదీన తిరుపతిలోని ఎంబియూ యూనివర్సిటీ నుంచి కార్యదర్శి కిరణ్‌కుమార్ తేజ్, గణేష్ నాయక్‌లు రూ.10లక్షలను తీసుకుని జల్ పల్లి లోని మంచు టౌన్ షిప్ కు వచ్చారు. అక్కడ కిరణ్‌కుమార్ తన గదిలో డబ్బులు పెట్టి పడుకున్నారు. మరునాడు ఉదయం లేచి చూసేసరికి అక్కడ రూ.10లక్షలు కనిపించలేదు. వెంటనే సి.సి కెమెరాలు పరిశీలించగా గణేష్ నాయక్ తన గదిలోకి వచ్చి వెళ్లినట్టు కనిపించక పోవడంతో పాటు గణేష్ నాయక్ కూడా పరారయ్యాడు. వెంటనే జరిగిన విషయాన్ని కార్యదర్శి కిరణ్ యజమాని మోహన్‌బాబుకు జరిగిన విషయాన్ని వివరించారు. దీంతో మోహన్ బాబు సూచన మేరకు కిరణ్‌కుమార్ ఈ నెల 23వ తేదీన రాత్రి 10గంటలకు పహాడిషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న గణేష్ నాయక్‌ను అదుపులోకి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 7,36,400లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు