బత్తిన నివాసంలో సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్న ఫిషరీస్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్

బత్తిన నివాసంలో సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్న ఫిషరీస్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్
ప్రజా క్షేత్ర్, చార్మినార్ :
చేప ప్రసాదం పంపిణీ కి ముందు రోజు ప్రతి సంవత్సరం సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించి అక్కడ బావికి పూజలు నిర్వహించిన అనంతరం ఆ నీటితోనే చేప ప్రసాదం తయారు చేయడం ఆనవాయితీగా వస్తుందని బత్తిన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. శనివారం పాతబస్తీ దూద్ బౌలి లోని బత్తిన నివాసంలో నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతానికి బత్తిన కుటుంబ సభ్యులు,వారి సన్నీ హితులతో పాటు తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, చార్మినార్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ ఇంచార్జి కె.వెంకటేష్ తదితరులు పాలొన్నారు.వారికి బత్తిన గౌరీ శంకర్ గౌడ్ స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.అనంతరం వారిని ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మెట్టు సాయి కుమార్ మాట్లాడుతూ ఆదివారం నాంపల్లి ఎక్సిబిషన్ మైదానంలో నిర్వహించే ఉచిత చేప ప్రసాదం పంపిణీ భగవంతుని ఆశీర్వాదంతో సజావుగా కొనసాగాలని కోరుకున్నానని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసిందని అన్నారు. ఈ ఏడాది కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు.