భూ భారతి చట్టాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి : జువ్వాడి కృష్ణారావు

భూ భారతి చట్టాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి : జువ్వాడి కృష్ణారావు

భూ భారతి చట్టాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి : జువ్వాడి కృష్ణారావు

ఇందిరమ్మ ఇళ్లు కు భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న జువ్వాడి కృష్ణారావు
ప్రజా క్షేత్ర్, కోరుట్ల : 
మండలం పైడుమడుగు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కు భూమి పూజ కార్యక్రమాల్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు లబ్ధిదారుల ఆహ్వానం మేరకు గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు . అనంతరం గ్రామంలో జరిగిన భూభారతి కార్యక్రమంలో పాల్గొని  గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి ద్వారా రైతులను ఎలా మోసం చేసింది వివరించి టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రజలందరికీ న్యాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.. అనంతరం గ్రామంలోని ప్రసిద్ధి చెందిన శుక్రవారం అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు..ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి కృష్ణ చైతన్యతో పాటు కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి ,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరిపెళ్లి జనార్ధన్, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఆశిరెడ్డి, రాజేశం,నేమురి భూమయ్య ,దొమ్మటి నరేందర్ గౌడ్, నేమిళ్ల రామ్మోహన్, సత్తిరెడ్డి, దొమ్మటి తిరుపతి గౌడ్, దుంపల అశోక్, మేకల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు