మాకు మంత్రి పదవి ఇవ్వండి సార్ ప్లీజ్
మాకు మంత్రి పదవి ఇవ్వండి సార్ ప్లీజ్
మల్లికార్జున్ ఖర్గేకి పోటాపోటీ నివేదికలు అందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
ఖర్గేను కలిసి తమ అభ్యర్థనలు వినిపించిన ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, బాలు నాయక్, రామ్మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖార్గేను పలువురు ఎమ్మెల్యేలు కలిసారు. ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, బాలు నాయక్, రామ్మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి అయనను కలిసి మాకు మంత్రి పదవి ఇప్పించడని నివేదికలు ఇచ్చారు.
అత్యధిక జనాభా ఉన్న హైదరాబాద్–రంగారెడ్డి జిల్లాలో మంత్రి లేకపోవడం ఇదే మొదటిసారని మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. బంజారాల్లో 80% మంది కాంగ్రెస్ కి మద్దతుగా నిలిచారని, అయినా తనకు మంత్రి పదవి ఇవ్వలేదని బాలు నాయక్ అన్నారు.
రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో మంత్రి పదవి లేనిది తానొక్కడికే అని న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి విన్నవించుకున్నారు.