చల్పాకలో తీవ్ర ఉద్రిక్తత
చల్పాకలో తీవ్ర ఉద్రిక్తత
ప్రజా క్షేత్ర్, ములుగు :
ఏటూరునాగారం మండలం చల్పాక శివారులో ఉద్రిక్తత నెలకొంది. అటవీభూముల్లో గిరిజనులు గుడిసెలు వేసుకున్నారు. దాంతో గుడిసెలు తొలగించేందుకు అటవీశాఖ అధికారులు, పోలీసులు భారీఎత్తున మొహరించారు. పోలీసులు, అటవీశాఖ అధికారులపై గిరిజనులు తిరగబడ్డారు. కర్రలతో ఎదురుదాడికి దిగారు. రిజర్వ్ ఫారెస్ట్ లో వేసిన గుడిసెలను తొలగించేందుకు అటవీశాఖ, అధికారులు పోలీసులు ప్రయత్నించారు. గిరిజనులు- అటవీశాఖ సిబ్బంది మధ్య తీవ్రవాగ్వాదం, తోపులాట జరిగింది.