రాజీనామా చేస్తా..ప్రజలు మళ్లీ గెలిపిస్తేనే సీఎం పీఠంపై కూర్చుంటా : కేజ్రీవాల్​

రాజీనామా చేస్తా..ప్రజలు మళ్లీ గెలిపిస్తేనే సీఎం పీఠంపై కూర్చుంటా : కేజ్రీవాల్​

రాజీనామా చేస్తా..ప్రజలు మళ్లీ గెలిపిస్తేనే సీఎం పీఠంపై కూర్చుంటా : అరవింద్​ కేజ్రీవాల్​ 

ప్రజాక్షేత్ర్, తెలంగాణబ్యూరో

ముఖ్యమంత్రి పదవికి రెండు రోజుల తర్వాత రాజీనామా చేస్తానని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఇటీవలే జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్ మళ్లీ ప్రజల తీర్పు కోరతానని, అప్పుడే తిరిగి సీఎం పీఠంపై కూర్చుంటానని స్పష్టం చేశారు. జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారి పార్టీ కార్యాలయానికి వచ్చిన కేజ్రీవాల్, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ప్రజలు మళ్లీ నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చే వరకు నేను ఆ పీఠంపై కూర్చోను. నేను ప్రతి వీధికి, ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజా తీర్పును కోరతాను. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. కేజ్రీవాల్ నిజాయితీపరుడు అని మీరు భావిస్తేనే నాకు ఓటేయండి. నేను నీతి పరుడిని కాదనుకుంటే నాకు ఓటేయకండి. నా నిజాయితీకి మీ ఓటే సర్టిఫికెట్. మళ్లీ ఎన్నికయ్యాకే నేను సీఎం పీఠంపై కూర్చుంటా’’ అని ఆయన పేర్కొన్నారు.