ఉత్తరాఖండ్ లో కూలిన హెలికాప్టార్... ఏడుగురు మృతి
ఉత్తరాఖండ్ లో కూలిన హెలికాప్టార్... ఏడుగురు మృతి
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ఘటన మరువకముందే ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం మరో విషాదంగా మారింది.ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ధామ్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం దేశవ్యాప్తంగా షాక్ కు గురించేసిన విషయం విధితమే. ఆదివారం ఉదయం 5:30 గంటల సమయంలో, కేదార్నాథ్ నుంచి గుప్తకాశీకి బయలుదేరిన ఒక హెలికాప్టర్ గౌరీకుండ్ సమీపంలోని అడవుల్లో కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్‌తో సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ హెలికాప్టర్ ఆర్యన్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందినదని, ఇది ప్రైవేట్ సర్వీస్ అని అధికారులు పేర్కొన్నారు.