రాడార్ ప్రాజెక్ట్ పనుల శంకుస్థాపనకు హాజరు కావాలని సీ ఎం రేవంత్ రెడ్డికి వినతి

రాడార్ ప్రాజెక్ట్ పనుల శంకుస్థాపనకు హాజరు కావాలని సీ ఎం రేవంత్ రెడ్డికి వినతి

రాడార్ ప్రాజెక్ట్ పనుల శంకుస్థాపనకు హాజరు కావాలని సీ ఎం రేవంత్ రెడ్డికి వినతి 

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

దేశ రక్షణలో కీలక భూమిక పోషించే భారత నావికాదళం (Indian Navy) వికారాబాద్ జిల్లా దామగుండంలో నిర్మించ తలపెట్టిన రాడార్ ప్రాజెక్ట్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఆహ్వానం అందించారు. పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి , దామగుండం రాడార్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్ బీర్ సింగ్, నేవీ ఉన్నతాధికారులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈనెల 15న పరిగి నియోజకవర్గంలోని పూడూరు మండలం దామగుండంలో నేవీ రాడార్ ప్రాజెక్టు పనుల శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నారు.