లాల్ దర్వాజా బోనాల ఉత్సవాల ప్రారంభోత్సవానికి పోలీసు కమిషనర్ కు ఆహ్వానం
లాల్ దర్వాజా బోనాల ఉత్సవాల ప్రారంభోత్సవానికి పోలీసు కమిషనర్ కు ఆహ్వానం
ప్రజా క్షేత్ర్, చార్మినార్ :
తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రతియేటా నిర్వహిస్తున్న లాల్ దర్వాజా బోనాల జాతర ఉత్సవాల ప్రారంభోత్సవానికి రావాలని హైద్రాబాద్ నగర పోలీసు కమిషనర్ సి.వి.ఆనంద్ ను ఆలయ కమిటీ ఆహ్వానం అందజేశారు.బుధవారం బంజారాహిల్స్ లో కమిషనర్ సి.వి.ఆనంద్ ను ఆలయ కమిటీ చైర్మన్ బి. మారుతీ యాదవ్,మాజీ చైర్మన్ కె.వెంకటేష్, కన్వీనర్ జి. అరవింద్ కుమార్ గౌడ్,కోశాధికారి ఎ.చంద్ర కుమార్, బి.సాయి ప్రసాద్,హర్ష తదితరులతో కూడిన ప్రతినిధి బృందం మర్యాద పూర్వకంగా కలిసిన శాలువాతో సన్మానించి ఆహ్వాన పత్రిక ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బోనాల ఉత్సవాల ప్రారంభోత్సవానికి పోలీసు కమిషనర్,జిహెచ్ఎంసి కమిషనర్ రావడం ఆనవాయితీగా వస్తుందని స్పష్టం చేశారు. ఈ సారి కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తూ కమిషనర్ చేతులమీదుగా 11న శుక్రవారం ఉదయం ఉత్సవాలను ప్రారంభించాడని సన్నాహాలు చేస్తున్నామని కమిటీ చైర్మన్ బి.మారుతీ యాదవ్ వెల్లడించారు.