లాల్ దర్వాజా సింహవాహిని ఆలయ కమిటీ చైర్మన్ గా మారుతీ యాదవ్

లాల్ దర్వాజా సింహవాహిని ఆలయ కమిటీ చైర్మన్ గా మారుతీ యాదవ్

లాల్ దర్వాజా సింహవాహిని ఆలయ కమిటీ చైర్మన్ గా మారుతీ యాదవ్

ప్రజా క్షేత్ర్,, చార్మినార్ :

తెలంగాణ లో ప్రసిద్ధి చెందిన, చారిత్రాత్మక లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం కమిటీ నూతన చైర్మన్ గా బి. మారుతీ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఆదివారం  మధ్యాహ్నం దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన దేవాలయ కమిటీ సర్వసభ్య సమావేశంలో ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు, కమిటీ సభ్యులు మారుతీ యాదవ్ ను చైర్మన్ గా ఎన్నుకున్నారు,గత ఐదు సంవత్సరాలుగా ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శిగా మారుతీ యాదవ్ అమ్మవారికి  సేవలు అందిస్తున్నారు.త్వరలోనే మరో సమావేశం ఏర్పాటు చేసి మిగతా కార్యవర్గాన్ని ఎన్నుకొని ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో  ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు జి.కాశీనాథ్ గౌడ్,సి.బంగ్లా రాజు యాదవ్,కె.విష్ణు గౌడ్, కె. వెంకటేష్,బి.బల్వంత్ యాదవ్, ఎ.మాణిక్ ప్రభూ గౌడ్, సి.వెంకటేష్, సి.రాజ్ కుమార్ యాదవ్, సి.రాజేందర్ యాదవ్, తిరుపతి నరసింగరావు,సిరా రాజ్ కుమార్,కన్వీనర్ జి.అరవింద్ కుమార్ గౌడ్,కోశాధికారి పోసాని సతీష్ ముదిరాజ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.