వరద బాధితులను ఆదుకోండి : రేవంత్రెడ్డి
వరద బాధితులను ఆదుకోండి : రేవంత్రెడ్డి
ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :
వరద బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వచ్చంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, ఇతర రంగాల్లోని ప్రముఖులు స్పందించాలని కోరారు. “వరద బాధితులను ఆదుకోవడానికి చేతనైనంత సహాయాన్ని అందించండి. మానవత్వం ప్రదర్శించాల్సిన సమయమిది” అని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF)కి విరాళాలు ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా గానీ, చెక్కులు, డీడీల రూపంలోగానీ లేదంటే యూపీఐ పేమెంట్ యాప్స్ నుంచి ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసిగానీ పంపవచ్చు.