2021 చరణాలతో ప్రపంచంలోనే అతి పెద్ద జానపద గీతం

2021 చరణాలతో ప్రపంచంలోనే అతి పెద్ద జానపద గీతం

2021 చరణాలతో కూడిన ప్రపంచంలోనే అతిపెద్ద జానపద గీతాన్ని రచించిన తెలంగాణ జానపద కళాకారుడు డాక్టర్ పత్రి కుమారస్వామిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. “2021 చరణాలతో అతిపెద్ద పాట” పుస్తకరూప జానపద గీతాన్ని సచివాలయంలో ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. 5 వేల చరణాలతో కూడిన మరో పాట కూడా పూర్తయి పుస్తకం రూపంలో ముద్రణ దశలో ఉన్నట్టు ఈ సందర్భంగా రచయిత తెలిపారు.