ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి జెసి ప్రభాకర్ రెడ్డి హెచ్చరిక
ప్రజా క్షేత్ర్, అమరావతి జూన్ 29 ;:
ఎపి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇల్లు రిజిస్ట్రేషన్ తప్పు అని ఇంటికి ప్లాన్ లేదని జెసి ప్రభాకర్ రెడ్డి అన్నారు. తమకు శత్రువు పెద్దారెడ్డి మాత్రమే అని తెలిపారు. అనంతపురంలో జెసి మీడియాతో మాట్లాడుతూ.. పెద్దారెడ్డి వెంట వైసిపి కార్యకర్తల ఫోటోలు (Photos activists) తన దగ్గర ఉన్నాయని, పెద్దారెడ్డి వెంట వచ్చిన వైసిపి కార్యకర్తలను రప్పా రప్పా ఆడిస్తామని హెచ్చరించారు. రేపటి నుంచి తమ కార్యకర్తలు ఎలా ఉంటారో చూడండి అని రేపటి నుంచి పెద్దారెడ్డి ఇంటి దగ్గర వైసిపి కార్యకర్తలు ఉంటే తమ కార్యకర్తలు రప్పా రప్పా అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం అని జెసి ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు.