ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం: సిఎం చంద్రబాబు

ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం: సిఎం చంద్రబాబు

ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం: సిఎం చంద్రబాబు

ప్రజా క్షేత్ర్, అమరావతి జూన్ 29 ;: విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్తామని ప్రజలకు చెప్పామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు  తెలిపారు. మూడు పార్టీలు ఎప్పటికప్పుడు సమన్వయంతో ముందుకెళ్తున్నాం అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లలో తాము ఏం చేయాలనే దానిపై ఇప్పటికే చర్చించాం అని ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేట్ అఖండ విజయం   సాధించామని చెప్పారు. ప్రజలు పెట్టిన ఆకాంక్షలను తాము కాపాడుకోవాలనినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండడం మన బాధ్యత అని తెలియజేశారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలనిభవిష్యత్తులో ఏం చేస్తామో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని అన్నారు. ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం అందరికీ న్యాయం చేశామని చంద్రబాబు పేర్కొన్నారు.