సిటీ సివిల్ కోర్టుకు బెదిరిపులు

సిటీ సివిల్ కోర్టుకు బెదిరిపులు

సిటీ సివిల్ కోర్టుకు బెదిరిపులు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్, జూలై 8 :
హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు కలకలం రేపింది. పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టులో బాంబు పెట్టామంటూ బెదిరింపులు వచ్చాయి. బాంబు బెదిరింపుతో కోర్టు కార్యకలాపాలు నిలిపివేశారు. చీఫ్ మెజిస్ట్రేట్‌ సూచనతో కోర్టు మూసివేశారు. సమాచారం అందుకున్న వెంటనే డాగ్‌, బాంబు స్క్వాడ్‌తో సిటీ సివిల్ కోర్టులో తనిఖీలు చేపట్టాయి. కోర్టులో బాంబు ఉందని బెదిరింపులు రావడంతో అడ్వకేట్లు, లాయర్లు, క్లైంట్స్ కోర్టు బిల్డింగ్ ప్రాంగణం నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని రోజుల కిందట బేగంపేట ఎయిర్ పోర్టుకు సైతం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆ సమయంలో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, హాస్పిటల్స్ లో బాంబులు పెట్టామంటూ బెదిరింపులు వచ్చాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనూ బాంబులు పెట్టాం, పేల్చివేస్తామని గతంలో బెదిరింపులు వచ్చాయి. తాజాగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టారని బెదిరింపు మెయిల్స్‌ రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. రాజ్‌భవన్‌, జింఖానా క్లబ్‌, సిటీ సివిల్‌ కోర్టు, సికింద్రాబాద్‌ సివిల్‌ కోర్టుల్లో బాంబులు పెట్టామంటూ మెయిల్స్‌ వచ్చాయని సిటీ పోలీసులు మంగళవారం తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్స్‌, డాగ్‌ స్వ్కాడ్స్‌తో క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి.
ఊపిరి పీల్చుకున్న పోలీసులు....
‘అబీదా అబ్దుల్లా’ అనే పేరుతో ఉన్న ఈ-మెయిల్ ఐడీ నుంచి ఈ బెదిరింపు సందేశాలు వచ్చాయి. సిటీ సివిల్ కోర్టు, జింఖానా క్లబ్‌లలో ఆర్‌డీఎక్స్, ఐఈడీ వంటి శక్తివంతమైన పేలుడు పదార్థాలు అమర్చామని, అవి కొద్దిసేపట్లో పేలిపోతాయని మెయిల్‌లో హెచ్చరించారు. దీంతో అధికారులు వెంటనే కోర్టు కార్యకలాపాలను నిలిపివేసి, న్యాయవాదులు, సిబ్బంది, ప్రజలను ప్రాంగణం నుంచి ఖాళీ చేయించారు.సమాచారం అందుకున్న బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు హుటాహుటిన బెదిరింపులు వచ్చిన అన్ని ప్రాంతాలకు చేరుకున్నాయి. సుమారు మూడు గంటల పాటు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. ఈ సోదాల్లో ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో బెదిరింపులు బూటకమని నిర్ధారించారు. దీంతో అధికారులు, నగర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, బెదిరింపు మెయిల్స్ పంపిన వారిని గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు