సీ ఎం రేవంత్ రెడ్డి కి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్

సీ ఎం రేవంత్ రెడ్డి కి కేంద్ర హోం మంత్రి అమిత్ షా  ఫోన్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఫోన్ చేసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపైముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడారు.క్షేత్రస్థాయిలో పరిస్థితిని వివరించిన సీఎం.. వరదల వల్ల  వాటిల్లిన నష్టాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు అవసరమైన తక్షణ సాయం చేస్తామని, వరద సహాయక చర్యల్లో సహకారం అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి  రాష్ట్ర స్థాయి అధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో నేరుగా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.