స్మశాన వాటిక అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన చార్మినార్ జోనల్ కమిషనర్

స్మశాన వాటిక అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన చార్మినార్ జోనల్ కమిషనర్
జోనల్ కమిషనర్ వెంకన్న కు కృతజ్ఞతలు
ప్రజా క్షేత్ర్, చార్మినార్ :
చాంద్రాయణగుట్ట నల్లవాగు హిందు స్మశాన వాటిక అభివృద్ధికి బల్దియా దక్షిణ మండలం జోనల్ కమిషనర్ వెంకన్న ప్రత్యేక నిధులు మంజూరు చేయడంతో సోమవారం కాంగ్రెస్ ఓబీసీ సెల్ నగర ఉపాధ్యక్షుడు కాశమోని శ్యామ్ రావు ముదిరాజ్,భాగ్యనగర్ బ్యాగరి సంఘం అధ్యక్షుడు పెరోజి సాయినాథ్ జోనల్ కమిషనర్ ని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సందర్భంగా వారూ మాట్లాడుతూ పనులు త్వరగా ప్రారంభించాలని కోరారు.