54 ప్రపంచ రికార్డ్ ల గ్రహీత సోనాలి ఆచార్జీ కి ఘనంగా సత్కారం
54 ప్రపంచ రికార్డ్ ల గ్రహీతకు ఘనంగా సన్మానం
ప్రజాక్షేత్ర్ , వెబ్ న్యూస్
66 గంటల వ్యవధిలో మండల ఆర్ట్ ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని గీసి 54 ప్రపంచ రికార్డ్ లను సొంతం చేసుకున్న ప్రముఖ క్లాసికల్ సింగర్, నృత్యకారిణి సోనాలి ఆచార్జీ ని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో శనివారం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు సముద్రాల వేణు గోపాల చారి ముఖ్య అతిధిగా పాల్గొని, మాట్లాడారు. తొమ్మిది అడుగుల మూడు ఇంచుల పొడవు ,ఏడు అడుగుల మూడు ఇంచుల వెడల్పుతో 66 గంటల వ్యవధిలో ప్రముఖ క్లాసికల్ సింగర్, నృత్యకారిణి సోనాలి ఆచార్జీ ఈ చిత్ర పటాన్ని గీసింనందుకు గాను 54 ప్రపంచ రికార్డ్ లను ఒకేసారి పొందడం అభినందనీయమన్నారు. ఈ సందర్బంగా ఆమెకు తెలంగాణ ప్రభుత్వం తరపున అవార్డు కోసం ప్రతిపాదనలు పంపనున్నట్లు చెప్పారు. సోనాలి ఆచార్జీ మాట్లాడుతూ తనకు చిన్ననాటి నుండి ఆర్ట్స్ వేయడంలో ఉత్సాహం ఉంది. నాకు సహకారం అందించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు.