అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం

అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం

అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం
ప్రజా క్షేత్ర్, గాంధీనగర్, జూన్ 12 :
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మేఘాని ప్రాంతంలో ఎయిర్‌ ఇండియా విమానం కూలింది. విమానంలో చాలామంది ప్రయాణికులు ఉన్నారని పేర్కొంటున్నారు. ప్రమాదం తరువాత ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది. టేకాఫ్‌ కాగానే విమానం కుప్పకూలింది. సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు.. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. జనావాసాలపై విమానం కూలినట్లు చెబుతున్నారు. మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పుతున్నారు.అహ్మదాబాద్‌లో టేకాఫ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విమానం వెనుక భాగం చెట్టును ఢీకొట్టిందని సమాచారం. విమానం అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళుతుండగా. విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారని చెబుతున్నారు.అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా ప్రయాణీకుల విమానం బోయింగ్ డ్రీమ్‌లైన్ 787 కుప్ప కూలిపోయింది. మధ్యాహ్నం 1:10 గంటలకు అహ్మదాబాద్‌ నుంచి టేకాఫ్‌ తీసుకున్న వెంటనే కూలిపోయింది. టేకాఫ్‌ తీసుకున్న వెంటనే మేఘానీ ప్రాంతంలో ప్రమాదం జరిగింది
సివిల్ హాస్పిటల్ వరకు గ్రీన్ కారిడార్
సివిల్ హాస్పిటల్ వరకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు అధికారులు. మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్ సహా ఇతర ఉన్నతాధికారులు సంఘటన స్థలంలో ఉన్నారు.
అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్ వెళ్లే విమానం AI 171 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానాశ్రయం వెలుపల కూలిపోయింది. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తి చేశారు. వెంటనే అహ్మదాబాద్ బయలుదేరి వెళ్లారు అమిత్ షా.అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం 171 కూలిపోయిందని ఎయిర్ ఇండియా ధృవీకరించింది. ఈ వినాశకరమైన సంఘటనలో ప్రభావితమైన వారందరి కుటుంబాలతో సంప్రదింపులు జరుగుతున్నట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధులు తెలిపారు. ఈ సమయంలో ప్రాథమిక దృష్టి బాధిత వారందరినీ, వారి కుటుంబాలను ఆదుకోవడం. అత్యవసర ప్రతిస్పందన బృందాలకు సహాయం చేయడానికి, బాధిత వారికి అవసరమైన అన్ని సహాయం, సంరక్షణను అందించడానికి, శక్తి మేరకు ప్రతిదీ చేస్తున్నామని ఎయింర్ ఇండియా తెలిపింద. అత్యవసర కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చి, సమాచారం కోరుకునే కుటుంబాల కోసం సహాయక బృందాలను ఏర్పాటు చేశామని ఎయిర్ ఇండియా తెలిపింది.సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రతినిధి కీలక ప్రకటన చేశారు. అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్ వెళ్లే విమానం AI 171 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానాశ్రయం వెలుపల కూలిపోయింది. దీంతో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేశారు. తదుపరి నోటీసు వచ్చే వరకు అన్ని విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. విమానాశ్రయానికి ప్రయాణించే ముందు తాజా అప్‌డేట్స్ కోసం ప్రయాణీకులు తమ తమ విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడుతో మాట్లాడి ప్రమాదం గురించి ఆరా తీశారు. “రక్షణ, సహాయ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు అహ్మదాబాద్ వెళ్తున్నారని ప్రధానమంత్రికి సమాచారం అందింది. అవసరమైన అన్ని సహాయాలను వెంటనే అందించాలని, పరిస్థితి గురించి క్రమం తప్పకుండా సమాచారం అందించాలని ప్రధానమంత్రి మంత్రిని ఆదేశించారు” అని విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది.అహ్మదాబాద్‌లోని ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ప్రదేశంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన ప్రయాణికులను చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లడానికి గ్రీన్ కారిడార్‌ను రూపొందిస్తున్నారు. గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలిస్తున్నారు.ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంతో అహ్మదాబాద్ విమానాశ్రయ రన్‌వే మూసి వేశారు. దీంతో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్లాల్సిన 4 ఇండిగో, 5 ఎయిర్ ఇండియా విమానాలు రద్దు అయ్యాయి.విమాన ప్రమాదంపై కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిసి షాక్‌కు గురయ్యానని కేంద్ర మంత్రి తెలిపారు. వ్యక్తిగతంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విమానానికి కెప్టెన్ సుమిత్ సభర్వాల్ నాయకత్వం వహించారు. ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ కూడా ఉన్నారని DGCA తెలిపింది.విమాన కెప్టెన్ సుమిత్ సభర్వాల్ 8200 గంటల LTC అనుభవం ఉంది. కో-పైలట్‌కు 1100 గంటల విమానయాన అనుభవం ఉంది. TC ప్రకారం, విమానం అహ్మదాబాద్ నుండి 1339 IST (0809 UTC)కి రన్‌వే 23 నుండి బయలుదేరింది. రన్‌వే 23 నుండి టేకాఫ్ అయిన వెంటనే, విమానం విమానాశ్రయ వెలుపల నేలపై కూలిపోయింది. ప్రమాద స్థలం నుండి భారీ నల్లటి పొగ వెలువడటం కనిపించింది” అని DGCA తెలిపింది.ప్రమాదంపై ఎయిర్ ఇండియా ప్రకటన వెలువడింది. అహ్మదాబాద్-లండన్ గాట్విక్ వెళ్తున్న AI171 విమానం ప్రమాదానికి గురైందని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం, ఈ సంఘటన గురించి సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు. వీలైనంత త్వరగా  సోషల్ మీడియా X హ్యాండిల్ వేదికగా మరిన్ని వివరాలను తెలియజేస్తామని తెలిపింది.ఈ ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సూరత్ నుండి అహ్మదాబాద్ బయలుదేరి వెళ్లారు.  యుద్ధ ప్రాతిపదికన తక్షణ సహాయ చర్యలను ప్రారంభించాలని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సూచనలు ఇచ్చారు. గాయపడిన ప్రయాణీకులకు తక్షణ చికిత్స అందించాలని కూడా ఆయన కోరారు.గాంధీనగర్ నుండి 90 మంది సిబ్బందితో కూడిన జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం  3 బృందాలను విమానం కూలిపోయిన ప్రదేశానికి పంపారు. వడోదర నుండి మొత్తం 3 బృందాలనుఢీకొట్టి కూలిపోయింది.ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ప్రమాదం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. విమానాశ్రయ సరిహద్దు సమీపంలోనే విమానం కూలిపోయింది.బయటపడిన ప్రాథమిక చిత్రాలలో, విమానం ముక్కలైపోయినట్లు కనిపిస్తుంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనస్థలానికి చేరుకుని సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు.విమానం ఒక రెక్క విరిగి పడిపోయినట్లు చిత్రంలో కనిపిస్తుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం, మంటలు కొంతవరకు అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు విమానం విమానాశ్రయం నుండి బయలుదేరుతోంది. చుట్టూ గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ ఘోర ప్రమాదాన్ని చూసి ప్రజలు భయపడి అక్కడికి పరుగులు తీశారు. విమానం పూర్తిగా దెబ్బతింది. విమానంలోని చాలా భాగాలు కాలి బూడిదయ్యాయి. విమానం కూలిపోయిన భవనం కూడా దెబ్బతింది.ప్రమాదంపై ఎయిర్ ఇండియా ప్రకటన వెలువడింది. అహ్మదాబాద్-లండన్ గాట్విక్ వెళ్తున్న AI171 విమానం ప్రమాదానికి గురైందని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం, ఈ సంఘటన గురించి సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు. వీలైనంత త్వరగా https://www.airindia.com/ , సోషల్ మీడియా X హ్యాండిల్ వేదికగా మరిన్ని వివరాలను తెలియజేస్తామని తెలిపింది.
అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేత
సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రతినిధి కీలక ప్రకటన చేశారు. అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్ వెళ్లే విమానం AI 171 టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానాశ్రయం వెలుపల కూలిపోయింది. దీంతో అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేశారు. తదుపరి నోటీసు వచ్చే వరకు అన్ని విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. విమానాశ్రయానికి ప్రయాణించే ముందు తాజా అప్‌డేట్స్ కోసం ప్రయాణీకులు తమ తమ విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించారు.