ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతే తస్మాత్ జాగ్రత్త : గజ్జల కాంతం

ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతే తస్మాత్ జాగ్రత్త : గజ్జల కాంతం

ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతే తస్మాత్ జాగ్రత్త...
* తెలంగాణ సొమ్ము అంతా దోచుకున్నారు...
* ప్రజల సొమ్ముతో అమెరికాలో ఇండ్లు కొన్నావు...
 * కేటీఆర్ థర్డ్ క్లాస్ పర్సంవి
 * మేడీగడ్డ చర్చకు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వస్తాడు....?
* నీ స్థాయికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ చాలు  
* టీపీసీసీ జనరల్ సెక్రటరీ గజ్జెల కాంతం  
ప్రజా క్షేత్ర్,  హైదరాబాద్ జూలై :

ష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతే తస్మాత్ జాగ్రత్త...అని టీపీసీసీ జనరల్ సెక్రటరీ గజ్జెల కాంతం హెచ్చరించారు.తెలంగాణ సొమ్ము అంతా దోచుకున్నారు... ప్రజల సొమ్ముతో అమెరికాలో ఇండ్లు కొన్నావు...కాని నీతి నిజాయితీగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు.జలశక్తి మంత్రితో సీఎంల సమావేశం జరిగింది...ఆ విషయాన్ని స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి క్లియర్ గా చెప్పిండు..చంద్రబాబుకు నీళ్ళు.... రాహుల్ గాంధీకి మూటలు...మాట్లాడటం విడ్డూరం..గౌరవ సోనియా కుటుంబం అంటేనే నీతి నిజాయితీ...ఈ దేశ ప్రజల కోసం పనిచేసిన నెహ్రు కుటుంబం ఆస్తి అంతా పేద ప్రజలకు ఖర్చు చేశారు..సోనియమ్మ, రాహుల్ గాంధీకి స్వంతంగా ఇల్లు లేదు.. ఎంపీ క్వార్టర్స్ లో ఉంటున్నారు.దేశం కోసమే గాంధీకుటుంబం పనిచేస్తుంది.దేశం కోసం రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారు..నీతి నిజాయితీగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు..రోజుకు 18 గంటలు పనిచేస్తున్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డి..గోదావరి, కృష్ణ నీళ్ళ విషయంలో నాడు జగన్ తో ఇంట్లో కలిసి మెలిసి తినలేదా!??రోజా ఇంట్లో భోజనం చేసీ రాయలసీమను రతనాల సీమగా చేస్తానని చెప్పలేదా ?మూడు వేల టీఎంసీల మిగులు జలాలున్నాయనీ కేసీఆర్ జగన్ తో చెప్పలేదా !???బిడ్డా కేటీఆర్ తస్మాత్ జాగ్రత్త... నువ్వు పెద్ద సంసారిలాగా మాట్లాడకు‌‌ కేటీఆర్రెండు రాష్ట్రాల సీఎంలు,సీఎస్ అధికారులందరి సమక్షంలో బహిరంగంగా చర్చ జరిగింది..మీరు ప్రగతి భవన్ లో జగన్ తో... రోజా ఇంట్లో నీటి మీద చర్చ చేసి పంపకాలు చేసుకోలేదా?కేంద్ర ప్రభుత్వం పిలిస్తే పోకుండా హరీష్ రావును పంపించారు..ఆనాడు నీళ్ళ విషయంలో ఏమీ పీకారు‌..ఫాంహౌస్ లో 2012లో ఇదే జగన్ తో అర్థరాత్రి కేసీఆర్ మాట్లాడలేదా ? ప్రతి డిపార్ట్మెంట్ లో ఆంధ్ర ఆఫీసర్లే ఉన్నారు కదా ఆంధ్రా బడాబాబులతోనే దోచిపెట్టి ప్రభుత్వాన్ని నడిపించుకున్నారు....బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తుంటే అరవడం ఎందుకు !?గతంలో మీరు బీసీలకు ఏమీ చేశారు....మేడీగడ్డ చర్చకు మా కరీంనగర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, రైతులు, అధికారులు వస్తారు..నీ స్థాయికి సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వస్తాడు....?థర్డ్ క్లాస్ పర్సన్ కేటీఆర్నీ అయ్య కేసీఆర్ ను అసెంబ్లీకి రమ్మను అక్కడ చర్చ చేస్తాడు.. మా సీఎం....ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ రేస్ , కాళేశ్వరం కమీషన్ దోపిడీ ఇవన్నీ విచారణలు కొనసాగుతున్నాయి..కచ్చితంగా 43% రిజర్వేషన్లు అమలు చేసి చూపిస్తాంఎస్సీ వర్గీకరణ చేశాం...బడుగు బలహీన వర్గాల ప్రజలు బాగు కోసం పనిచేస్తాం...బీసీ బిడ్డా ఈటెల రాజేందర్ ను అవమానంగా పార్టీ నుంచి బయటకు పంపించారు..గతంలో డిప్యూటీ సీఎం రాజయ్యను బర్తరఫ్ చేసి అవమానించలేదా !?దళితులకు మూడు ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, బీసీ బంద్,దళితుని సీఎం చేస్తాననీ మోసం చేయలేదా !?మేము దాడులు చేస్తే నువ్వు తట్టుకోలేవు....మేము స్టార్ట్ చేస్తే టీ న్యూస్ ఉంటదా..?కేటీఆర్ దొరంహకారం తగ్గించుకో బిడ్డా గతంలో నన్ను కూడా బెదిరించే ప్రయత్నం చేశావ్ ... తస్మాత్ జాగ్రత్త