2034 వరకు నేనే ముఖ్యమంత్రిని

2034 వరకు నేనే ముఖ్యమంత్రిని

2034 వరకు నేనే ముఖ్యమంత్రిని
సీఎం రేవంత్ రెడ్డి
ప్రజా క్షేత్ర్, నాగర్ కర్నూలు :
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం జటప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడం తన బాధ్యత అంటూ స్పష్టం చేశారు. వెనుకబడిన కొల్లాపూర్ ప్రాంతానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పాలమూరు ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. డిసెంబర్లోగా భూసేకరణ పూర్తి చేసి, కృష్ణా జలాలను పొలాలకు తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రూ.21వేల కోట్ల రైతు రుణమాఫీ చేసినట్లు గుర్తు చేసారు.  పాలమూరు పచ్చగా మారాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ లక్ష్యం కోసం కృషి చేస్తోందని సీఎం స్పష్టం చేశారు. రేవంత్ తన ప్రసంగంలో కేసీఆర్, కేటీఆర్ లపై వరుస విమర్శలు చేసారు. కేసీఆర్ హయంలో రూ.25వేల కోట్లు ఖర్చు చేసి ఉంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇప్పటికే పూర్తయ్యేదన్నారు. . జిల్లాకు చెందిన వివిధ ప్రాజెక్టులను పక్కన పెట్టారని ఆరోపించారు. తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ హయాంలోనే ఎక్కువ అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ హామీలు నెరవేరలేదని అన్నారు. రేవంత్ విమర్శించారు.
కాంగ్రెస్ హయాంలో పాలమూరు పచ్చగా మారుతుంటే కేసీఆర్కు దుఃఖం వస్తోందని అన్నారు. 2034 వరకు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడని కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. దీనిని కేసీఆర్ తన గుండెల మీద రాసుకోవాలని పేర్కొన్నారు.