కన్నుల పండువగా ఊంజలి సేవోత్సవం

కన్నుల పండువగా ఊంజలి సేవోత్సవం

కన్నుల పండువగా ఊంజలి సేవోత్సవం
ప్రజా క్షేత్ర్, యాదగిరిగుట్ట జూలై :
 తెలంగాణ తిరుపతిగా... ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సేవలకు ప్రసిద్ధి. శుక్రవారం కొండపైన శ్రీ స్వామివారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఊంజలి సేవొత్సవాన్ని ఆలయ అర్చకులు ఘనంగా ...శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించారు. కన్నుల పండుగగా కొనసాగిన ఈ ఉత్సవంలో అమ్మవారికి మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఈ సేవోత్సవాన్ని పురస్కరించుకొని అమ్మవారిని ఆలయంలో అధిష్టింపజేశారు.