దేశానికే ఆదర్శమైన గురుకులాలు రేవంత్‌ రెడ్డి పాలనా వైఫల్యం వల్ల నిర్వీర్యం : ఎమ్మెల్యే హరీష్ రావు

దేశానికే ఆదర్శమైన గురుకులాలు రేవంత్‌ రెడ్డి పాలనా వైఫల్యం వల్ల నిర్వీర్యం : ఎమ్మెల్యే హరీష్ రావు

దేశానికే ఆదర్శమైన గురుకులాలు రేవంత్‌ రెడ్డి పాలనా వైఫల్యం వల్ల నిర్వీర్యం

                   బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శ

ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 30 ; బీఆర్ఎస్ పాలనలో దేశానికే ఆదర్శమైన గురుకులాలురేవంత్‌ రెడ్డి పాలనా వైఫల్యం వల్ల నిర్వీర్యం అవుతుండటం దారుణమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్ రావు   విమర్శించారు. విద్యావ్యవస్థ పట్ల కాంగ్రెస్ చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి లక్షల మంది ఎస్సీఎస్టీబీసీ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నదని ఆరోపించారు. రేవంత్ పాలనలో గురుకుల పాఠశాలలుకళాశాలల పరిస్థితి రోజురోజుకు దిగజారుతుండటం శోచనీయమని వెల్లడించారు. జనవరి నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో కోడిగుడ్లుమాంసంఅరటి పండ్ల సరఫరా నిలిచిపోయాయని చెప్పారు. బకాయిలు చెల్లించకుంటే జులై 1 నుంచి అన్ని రకాల ఆహార పదార్థాలుఇతర సామాగ్రి సరఫరాను నిలిపేస్తామని హెచ్చరించే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు.మరోవైపు 13 నెలలుగా రూ.450 కోట్లకుపైగా అద్దె బకాయిలు చెల్లించక భవనాల యజమానులు తాళాలు వేస్తున్న దుస్థితి నెలకొన్నదని చెప్పారు. విద్యా సంవత్సరం ప్రారంభమై ఇన్ని రోజులు అవుతున్నా ఇప్పటికీ యూనిఫాంటైబెల్ట్బూట్లుస్కూల్ బ్యాగులు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. ఎస్సీఎస్టీబీసీ గురుకులాల్లో యూనిఫామ్ ఇవ్వకపోవడంతో పిల్లలు పాతచినిగిపోయిన దుస్తులు వేసుకుంటున్నారని తెలిపారు. పదేండ్లలో అద్భుతంగా నడిచిన గురుకులాల వ్యవస్థరేవంత్   పాలనలో కుదేలవుతుండటం దురదృష్టకరమన్నారు.దిగజారుతున్న గురుకులాల ఖ్యాతిని నిలబెట్టాలనిఎస్సీ ఎస్టీబీసీమైనార్టీ వర్గాలకు చెందిన పేద పిల్లల భవిష్యత్తును కాపాడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురుకుల కాంట్రాక్టర్ల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలకు బకాయిలు వెంటనే చెల్లించాలని తెలిపారు. ఆహార పదార్థాలుఇతర సామగ్రి సరఫరా అంతరాయం లేకుండా చూడాలన్నారు. యూనిఫామ్బూట్లుస్కూల్ బ్యాగులు.. తక్షణమే పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు.