ఉగ్రవాదుల ఇళ్లనుంచి భారీ పేలుడు పదార్ధాలు స్వాధీనం
ఉగ్రవాదుల ఇళ్లనుంచి భారీ పేలుడు పదార్ధాలు స్వాధీనం
పోలీసులపై దాడి చేసిన నిందితుల భార్యలకు రిమాండ్
ప్రజా క్షేత్ర్, రాయచోటి :
రాయచోటి పట్టణంలో నిర్వహించిన ఉగ్రవాదుల ఇంటి సోదాలపై కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు వివరాలు వెల్లడించారు.2025 జూన్ 30న తమిళనాడు పోలీసులు పలు బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితులపై జారీ చేసిన అరెస్ట్ వారెంట్లను అమలు చేశారు. ఈ నిందితులు 1999 నుండి పరారీలో ఉండగా, వారు గత 20 సం. గా రాయచోటి పట్టణంలో తప్పుడు పేర్లతో (అబూ బకర్ సిద్ధిక్ – అమానుల్లా పేరుతో, మహమ్మద్ అలీ – మంసూర్ పేరుతో) నివసిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందిన తర్వాత, అన్నమయ్య జిల్లా పోలీసులు తక్షణమే స్పందించి, రాయచోటిలోని కొత్తపల్లి మహబూబ్ బాషా వీధిలో ఉన్న నిందితుల ఇళ్లను చట్టపరమైన విధానాల ప్రకారం శోధించారు. ఈ గృహశోధనలో భారీ మొత్తంలో విస్ఫోటక పదార్థాలు లభించాయి, వీటిని ఉపయోగించి పేలుడు పరికరాలు తయారు చేయవచ్చు. ఈ పదార్థాలు భారతదేశ పౌరుల ప్రాణాలకు తీవ్ర ప్రమాదాన్ని కలిగించే స్థాయిలో ఉన్నాయి. ఈ శోధనతో దేశ స్థాయిలో ప్రమాదం నివారించారు. అబూ బకర్ సిద్ధిక్ @ అమానుల్లా మరియు మహమ్మద్ అలీ @ మంసూర్ అనే ఉగ్రవాదుల కార్యకలాపాలకు సంబంధించి ఈ సామగ్రిని పోలీస్ బృందం స్వాధీనం చేసుకుంది. వీరు "అల్ ఉమ్మా" అనే తీవ్రవాద సంస్థతో అనుబంధం కలిగినవారిగా గుర్తించారు. నిందితులనుంచి ఫ్యూయల్ ఆయిల్తో కలిపిన అమ్మోనియం నైట్రేట్ – ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోసివ్, స్లర్రీ ఎక్స్ప్లోసివ్ – (నైట్రో గ్లిసరిన్ / అయ్యి ఉండవచ్చు) తో నిండి ఉండే బాంబు, 20 కేజీల లో మరొక సూటికస్ అయ్యి ఉండవచ్చు, ఒక బాక్స్ – ఐ ఈ డి అయ్యి ఉండవచ్చు. పొటాషియం నైట్రేట్, పొటాషియం క్లోరేట్, పొటాషియం పెర్మాంగనేట్, గన్ పౌడర్, డ్యాగర్, కొడవళ్లు, టైమర్ల కోసం గడియార యంత్రాలు, పుల్ స్విచ్లు, ప్రెషర్ స్విచ్లు, స్పీడ్ కంట్రోలర్లు, గ్యాస్ ట్యూబ్ అరెస్టర్లు పేలుళ్ల సమయంలో గాయాలకు ఉపయోగించే బాల్ బెరింగ్స్, నట్-బోల్టులు, మానిటరింగ్ కోసం బైనాక్యూలర్స్, వాకీ-టాకీలు, రేడియో పరికరాలు, అనేక మొబైల్ ఫోన్లు, అనేక చెక్ పుస్తకాలు స్వాదీనం చేసుకున్నారు. ఆర్థిక లావాదేవీల సమాచారం కుడా లభించింది. డిజిటల్ స్టోరేజ్ పరికరాలు, ముస్లిం సాహిత్యం, భారతదేశంలోని నగరాల మ్యాపులు, టైమింగ్ సర్క్యూట్ల మాన్యువల్స్, కోడింగ్ బుక్స్ కుడా లభించాయి. ఈ ఇంటి శోధన సందర్భంగా, నిందితుల భార్యలు సైరా భాను (అబూ బకర్ సిద్ధిక్ భార్య) షేక్ షమీం (మహమ్మద్ అలీ భార్యలు) పోలీసులపై ప్రతిఘటన చేయడమే కాకుండా మహిళా పోలీసులపై దాడికి యత్నించారు. ఈ ఘటనపై రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదు చేసారు. సైరా భాను, షమీం లు పోలీసులపై దాడికి ప్రయత్నించినందుకు అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు రిమాండ్ కి పంపారు. వీరికి నిందితుల ఉగ్రచర్యలపై ఎంత సంబంధముందో అనే దానిపై దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు.