ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్.. వరంగల్ కు తరలింపు
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్.. వరంగల్ కు తరలింపు
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వరంగల్ సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు ఆయనను శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుని, వరంగల్ కు తరలించారు. ఆయనపై బీఎన్ఎస్ సెక్షన్ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదుచేశారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించే అవకాశం ఉంది. మనోజ్ రెడ్డి అనే వ్యాపారిని రూ.50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించాడని అతని భార్య సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.