టెలికం శాఖ మొబైల్ ప్లాన్ల మార్పు ప్రక్రియను మరింత సరళతరం
టెలికం శాఖ మొబైల్ ప్లాన్ల మార్పు ప్రక్రియను మరింత సరళతరం
ప్రజా క్షేత్ర్, న్యూ డిల్లీ జూన్ 13 :
దేశంలో మొబైల్ వినియోగదారులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. టెలికం శాఖ మొబైల్ ప్లాన్ల మార్పు ప్రక్రియను మరింత సరళతరం చేయాలని నిర్ణయించింది. జూన్ 10, 2025 నుంచి అమల్లోకి వచ్చిన ఈ మార్పులతో వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా టెలికాం ప్లాన్లను ఈజీగా మార్చుకోవచ్చు. ఈ మార్పు ప్రకారం మీరు ఒకసారి ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్ లేదంటే పోస్ట్‌పెయిడ్ టూ ప్రీపెయిడ్‌కు మారిన తర్వాత, తదుపరి మార్పు కోసం కేవలం 30 రోజుల వేచి ఉంటే సరిపోతుంది.
ఓటిపి ఆధారిత మార్పు....
ఇది వరకు ఈ వ్యవధి 90 రోజులుగా ఉండేది. అంటే 30 రోజుల తర్వాత మీకు ఆ ప్లాన్ నచ్చకుంటే మళ్లీ మారిపోవచ్చు. ప్రస్తుతం, మీరు OTP ద్వారా మీ ప్లాన్ మార్చుకునే ఛాన్సుంది. ఈ ప్రక్రియలో మీ ఆధార్ లేదా డిజిలాకర్ ద్వారా మీ వివరాలు ధృవీకరించబడతాయి. ఫిజికల్ KYC కూడా అవసరం లేదు. మీరు 30 రోజుల కూలింగ్ ఆఫ్ సమయంలో ఉంటే, ఫిజికల్ KYC ప్రక్రియ ద్వారా ప్లాన్ మార్చుకోవచ్చు. ఈ ప్రక్రియలో మీ వివరాలు ఆథారైజ్డ్ పాయింట్ ఆఫ్ సేల్ వద్ద ధృవీకరించబడతాయి.