నడిరోడ్డుపై హద్దులు దాటిన ముద్దులు
నడిరోడ్డుపై హద్దులు దాటిన ముద్దులు
ప్రజాక్షేత్ర్, వెబ్ న్యూస్
నడిరోడ్డు పై ప్రేమికులు వికృతచేష్టలకు పాల్పడుతున్నారు....తాము నడిరోడ్డుపై ఉన్నామన్నధ్యాసనే మరిచారు...ఏకంగా బైక్ పై ప్రాణాంతక విన్యాసాలు చేస్తూ ముద్దులు పెట్టుకుంటున్న చిత్రాలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. ఇదంతా హైదరాబాద్ నగర శివార్లలోని పహాడీషరీఫ్ ప్రధాన రహదారిలో ఓ ప్రేమికుల జంట బైక్పై వెళ్తూ కెమెరాకు చిక్కింది. రోడ్డు మీద ఉన్నామన్న సంగతి మరిచారు. ఏకంగా బైక్ వెనుక సీటులో సదరు యువతి కూర్చోకుండా బైక్ పెట్రోల్ ట్యాంక్ పై భాగంలో రివర్స్ కూర్చొని ప్రేమికునికి ముద్దులు వర్షం కురిపించింది. పక్కన వెళ్తున్న తోటి వాహాదారులు ఏం మాయ రోగం అంటూ సిగ్గుతో తలదించుకున్నారు. ఆ ముద్దులకు అతను రయి....రయిమంటూ రోడ్డుపై దూసుకెళ్ళే చిత్రం కెమెరా కంటపడింది. వారిద్దరి భాగోతం వెలుగు లోకి వచ్చింది. దీంతో రోడ్డు పై న్యూసెన్స్ చేసిన ఆ జంట ఆచూకీ కోసం పోలీసులు ఆరాతీస్తున్నారు.