ఆర్మీ జవాను భూ సమస్యను పరిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఆర్మీ జవాను భూ సమస్యను పరిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఆర్మీ జవాను భూ సమస్యను పరిష్కరించిన మంత్రి నారా లోకేష్

మంత్రి లోకేష్ న్యాయం చేయాలంటూ కశ్మీర్ నుంచి సెల్ఫీ వీడియో

తక్షణమే స్పందించి జవాన్ కు అండగా నిలిచిన మంత్రి నారా లోకేష్

మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన జవాన్ కుటుంబ సభ్యులు

ప్రజా క్షేత్ర్, అమరావతిః
 దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడే ఆర్మీ జవాన్ కు మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం కె.శివరంలో తన భార్య తల్లిదండ్రులకు చెందిన రెండెకరాల భూమిని కబ్జా చేశారంటూ రాష్ట్రానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ డి.నరసింహమూర్తి జమ్మూకశ్మీర్ నుంచి సెల్ఫీ వీడియో విడుదల చేయడం సంచలనం రేపింది. అమరాపురం మండలం ఉదుకూరుకు చెందిన నరసింహమూర్తి దేశ సరిహద్దుల్లో జవాన్ గా విధులు నిర్వహిస్తున్నారు. వైసీపీ హయాంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేసిన నాగరాజు అనే వ్యక్తి తమ భూమిని కబ్జా చేశారని, విచారించి తగిన న్యాయం చేయాలంటూ సెల్ఫీ వీడియో ద్వారా మంత్రి నారా లోకేష్ ను జవాన్ విజ్ఞప్తి చేశారు. సదరు వీడియోపై తక్షణమే స్పందించిన మంత్రి నారా లోకేష్ భూ సమస్యను పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు సర్వే జరిపి పోలీసుల సమక్షంలో హద్దులు నిర్ణయించడంతో సదరు భూ సమస్య పరిష్కారమైంది. మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకుని తమకు అండగా నిలవడం పట్ల జవాన్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.