ఉప్పుగూడ బోనాల ఉత్సవాలలో పాల్గొనాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఆహ్వానం
ఉప్పుగూడ బోనాల ఉత్సవాలలో పాల్గొనాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు ఆహ్వానం
ప్రజా క్షేత్ర్, చార్మినార్ :
ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయ 76వ వార్షిక బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 20 వ తేదీన జరుగనున్న బోనాల ఉత్సవాలలో పాల్గొనాలని కోరుతూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని ఆలయ కమిటీ అధ్యక్షులు జనగామ మధుసూదన్ గౌడ్ బృందం ఆదివారం మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కే. నరేందర్ ముదిరాజ్, కోశాధికారి బి. కిరణ్ గౌడ్, సంయుక్త కార్యదర్శి బి. అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.