ఎమ్మెల్యే గాంధీపై హత్యాయత్నం కేసునమోదు
ఎమ్మెల్యే గాంధీపై హత్యాయత్నం కేసునమోదు
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఫిర్యాదుతో కేసునమోదు చేసిన గచ్చి బౌలి పోలీసులు
ప్రజాక్షేత్ర్, క్రైం బ్యూరో :
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డివ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ తో పాటు అతని అనుచరులు దాడికి పాల్పడ్డారంటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గచ్చిబౌలి పోలీసులు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీతో పాటు 30 మంది పై కేసు నమోదు చేశారు. ముఖ్యంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, అల్వీన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తదితరులపై ఐపిఎస్ 189, 191(2), 191(3), 61,132,329,333,324 (4)324(5)351(2) r/w 190 బీఎన్ సెక్షన్ల కింద గచ్చిబౌలి పోలీసులు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.