ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్

ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్

ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం అనంతరం బస్సులో ప్రయాణం చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క,మంత్రి పొన్నం ప్రభాకర్.

ప్రజా క్షేత్ర్, సూర్యాపేట :

ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లతో కలిసి సోమవారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభిచారు. ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం అనంతరం  డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క,మంత్రి పొన్నం ప్రభాకర్ లు బస్సులో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యేలు పద్మావతి రెడ్డి, మందుల శామ్యూల్,టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, వ్యవసాయ కమిషన్ సభ్యులు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ చుట్టు ముట్టు సూర్యాపేట నట్ట నడుమ నల్లగొండ అని సూర్యాపేట కు ఉన్న  ఖ్యాతిని గుర్తించి సూర్యాపేట కు 79 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించడం జరిగింది.45 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు.రాబోయే కాలంలో మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల సౌకర్యాలు దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం,ఆర్టీసీ సంస్థ పరిరక్షణ  మూడు నినాదాలతో ముందుకు పోతుంది.గతంలో నష్టాలబాట పట్టి గత 10 సంవత్సరాల్లో ఒక్క బస్సు కొనుగోలు చేయక, ఒక్క ఉద్యోగం కూడా నియామకం చేయని పరిస్థితి ఉండేది. ఇప్పుడు వేలాది నూతన బస్సుల కొనుగోలు వేలాది ఉద్యోగాల నియామకాలు చేపడుతున్నామని అక్క చెల్లెళ్ల ఆశీర్వాదం ప్రభుత్వ నిర్ణయం మహా లక్ష్మి పథకం ద్వారానే సాధ్యం అవుతుంది.ఇప్పటి వరకు 182 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ లో ఉచితంగా ప్రయాణం చేశారు దాదాపు 6200 కోట్ల రూపాయలు వాళ్ళు అదా చేసుకున్నారు.మహిళలు హాస్పిటల్, గుడి కి ఎక్కడికి వెళ్లాలన్న ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు.దేవాలయాల దగ్గర రద్దీ కనిపిస్తుంది అంటే ఆర్టీసీ లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడమే.నెలకు 330 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం ఇస్తుంది. పిఎఫ్, సిసిఎస్ బకాయిలు ప్రభుత్వం చెల్లిస్తుంది.ఆర్టీసీ లాభాల బాటలో తీసుకుపోతుంది అంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే.ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం చేస్తున్నాం.వారి సమస్యలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి కార్మికుల సంక్షేమం వారి సేవలు గుర్తిస్తూనే ఆర్టీసీ సంస్థ పరిరక్షిస్తూ ముందుకు పోతున్నాం.45 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభిస్తున్నాం ఇవి సూర్యాపేట నుండి హైదరాబాద్, ఖమ్మం, హనుమకొండ తదితర ప్రాంతాల్లో ప్రయాణం చేస్తాయి.నల్గొండ కేంద్రంలో కూడా ఇవి బస్సులు ప్రారంభం చేసుకుంటున్నాం.హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ లలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించాం.ఆర్టీసీ అంటే ప్రజలది ప్రభుత్వంది దీనిని పరిరక్షించుకోవాలి.ఎక్కడ గ్రామాల్లో చూసినా బస్సులు కావాలని అడుగుతున్నారు శాసన సభ్యులు బస్సులు అడుగుతున్నారు.నూతన బస్సుకు కొనుగోలు చేస్తున్నాం అన్ని మండలాలు జిల్లాలకు జిల్లాల నుండి రాజధానికి బస్సులు కనెక్ట్ చేస్తున్నామని పేర్కొన్నారు.