కంటితుడుపుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూరాల పర్యటన

కంటితుడుపుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూరాల పర్యటన

కంటితుడుపుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూరాల పర్యటన
ప్రజా క్షేత్ర్, వనపర్తి :
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూరాల పర్యటన కంటితుడుపుగా కొనసాగిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు.జూరాలలో ఐరన్ రోప్ లు తెగడం సాధారణం అయితే అసలు జూరాల పర్యటనకు ఎందుకు వచ్చారు ? ఆ సమస్యతో ప్రాజెక్టుకు ఎలాంటి ఇబ్బందులు లేకుంటే ఆఘమేఘాల మీద మంత్రి పర్యటన ఎందుకు ? మరి వచ్చిన మంత్రి స్పిల్ వే, క్రస్ట్ గేట్లు, ఐరన్ రోప్ లు తెగిన వాటిపై ఎందుకు పరిశీలన చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాజెక్టుల మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.. కేవలం మొక్కుబడిగా విధులు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో ధ్వంసమైన తెలంగాణ వ్యవసాయ రంగాన్ని బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్  నిలబెట్టారు. కేవలం ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో తిరిగి సమూలంగా నాశనం చేస్తున్నారు. కాంగ్రెస్ కుట్రలకు ప్రజలు సమాధానం చెప్పడం ఖాయం. జూరాల ప్రాజెక్టులో ఐరన్ రోప్ లు తెగిన విషయంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొక్కుబడి పర్యటనపై ఒక ప్రకటనలో విమర్శించారు.