కాంగ్రెస్ పాలనలో మెడికల్ కళాశాలల భవిష్యత్ గందరగోళం : జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత

కాంగ్రెస్ పాలనలో మెడికల్ కళాశాలల భవిష్యత్ గందరగోళం : జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత

కాంగ్రెస్ పాలనలో మెడికల్ కళాశాలల భవిష్యత్ గందరగోళం : జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత

కాంగ్రెస్ పాలనలో మెడికల్ కళాశాలల భవిష్యత్ గందరగోళం
పాలన వదిలేసి ప్రతీకార చర్యలతోనే ఈ దుస్థితి.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి.
 జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత
ప్రజా క్షేత్ర్, జగిత్యాల : 
 జగిత్యాల మెడికల్ కాలేజీలో మౌలిక వసతులు లేక జాతీయ వైద్య మండలి నోటీసులు జారీ చేయాదంతోనే రాష్ట్రంలోని మెడికల్ కళాశాల ల పరిస్థితి గందరగోళంగా మారిందని తాజా మాజీ జడ్పి చైర్మన్ దావ వసంత అన్నారు. జగిత్యాల  జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్   మాట్లాడారు. ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో ప్రారంభించిన ప్రభుత్వం మెడికల్ కాలేజీల భవితవ్యం రేవంత్ రెడ్డి పాలనలో ప్రశ్నార్థకంగా మారిందనీ అన్నారు. జగిత్యాల జిల్లా మెడికల్ కాలేజ్ కు నోటీసులు రావడం సిగ్గుచేటు అని అన్నారు. జగిత్యాల జిల్లా మెడికల్ కాలేజీ తో పాటు 26 మెడికల్ కాలేజీల్లో నిబంధనలకు అనుగుణంగా సౌకర్యాలు వసతులు లేకపోవడంపై ఈ నెల 18 న ఎన్. ఎమ్. సి ముందు ప్రత్యక్షంగా హాజరుకావాలని హెల్త్ సెక్రటరీ, డీఎంఈ కి నోటీసులు ఇవ్వడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనం అని అన్నారు. 2014లో స్వరాష్ట్రం ఏర్పడ్డ నాటికి తెలంగాణలో ఐదు ప్రభుత్వ ,15 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వాటిలో 2850 ఎంబిబిఎస్ సీట్లు మాత్రమే ఉండేవి అని అన్నారు తెలంగాణ ఏర్పాటు అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కో జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో 2023 అక్టోబర్ నాటికి మొత్తం కళాశాలల సంఖ్య 56 సీట్ల సంఖ్య 8340 కి చేరింది అప్పటికి కెసిఆర్ ప్రభుత్వం మరో 8 మెడికల్ కాలేజ్లు మంజూరు చేయడంతో మొత్తం సీట్ల సంఖ్య 9140 కి చేరిందన్నారు.  కానీ కెసిఆర్ సంకల్పానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పోడుస్తుందని అన్నారు. వైద్య కళాశాలలో కనీసం వసతులు కల్పించలేని దుస్థితిలో  రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని అన్నారు.
కెసిఆర్  నాయకత్వంలో మొదటి జగిత్యాల మెడికల్ కాలేజ్ కు  పెర్మిషన్ వచ్చింది ఇవాళ కనీసం కనీస అవసరాలు  లేని దుస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లోఎందుకు వచ్చింది  ఇప్పుడు ఉన్న నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదు అని ప్రశ్నించారు. అప్పట్లో జగిత్యాల జిల్లాకు మెడికల్ కాలేజీ వస్తదా అని అన్న నాయకులు కేసీఆర్  సారధ్యంలో కల్వకుంట్ల కవితక్క  కృషి తో జగిత్యాల జిల్లాకు మెడికల్ కాలేజీనీ సాధించుకున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు  హయాంలో మెడికల్ కాలేజీకు అన్ని అనుమతులు సాధించుకున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలైనా కూడా కేసీఆర్ ని విమర్శిస్తూనే ఉన్నారు కానీ పాలన మీద దృష్టి సాదించడం లేదని అన్నారు. రేవంత్ రెడ్డి పాలనను గాలికి వదిలేసి ప్రతికార రాజకీయాలు చేస్తున్నారని ఇప్పటికైనా కళ్ళు తెరిచి జగిత్యాల జిల్లా మెడికల్ కాలేజీకి కావలసిన  నిధులు విడుదల చేసి, మౌలిక సదుపాయాలు కల్పించి ఎన్. ఎమ్. సి నిబంధనలకు అనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పించి విద్యార్థి జీవితాలను నిలబెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ మహేష్, మాజీ కౌన్సిలర్ దేవేందర్ నాయక్, సీనియర్ నాయకులు వెంకటేశ్వర్ రావు, రిజ్వాన్, అనురాధ, బాలే చందు తదితరులు పాల్గొన్నారు.