క్యూలైన్లలో భక్తుల అష్ట కష్టాలు....గంటల తరబడి నిరీక్షణ
క్యూలైన్లలో భక్తుల అష్ట కష్టాలు....గంటల తరబడి నిరీక్షణ
అధికారుల తీరుపై అరుపులు, కేకలు
ప్రజా క్షేత్ర్, శ్రీకాళహస్తి జూన్ 14 :
వారాంతపు రద్దీతో శ్రీకాళహస్తీశ్వరాలయం భక్తజనసంద్రంగా మారింది. ముక్కంటిశుని దర్శనం కోసం రెండవ శనివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. సర్వదర్శనంతోపాటు రాహు కేతు పూజలకు సంబంధించిన క్యూలైన్లు ప్రత్యేక శీఘ్రదర్శన క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. ఉక్కపోత కారణంగా భక్తులకు అవస్థలు తప్పడం లేదు అయితే అడ్డదారి దర్శనాలు నిలువరించడంలో ఉద్యోగులు విఫలమయ్యారు. క్రింది స్థాయి ఉద్యోగుల సహకారంతో దళారులు యదేచ్చగా భక్తులను అడ్డదారిలో తీసుకెళ్లి దర్శనాలు చేయించి జేబులు నింపుకుంటున్నారు. దీంతో సామాన్య భక్తులు కొంత మేర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.ఉన్నత అధికారులందరూ వీఐపీలు సిపార్సు దర్శనాలకు వచ్చే సేవల్లో తల మునకలయ్యారు.సామాన్య భక్తుల బాగోగులు పట్టించుకునే వాళ్ళు లేకపోవడంతో అవస్థలు తప్పలేదు.