టీపీసీసీ అధ్యక్షులుగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియామకం
టీపీసీసీ అధ్యక్షులుగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియామకం
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానికి ధన్యవాదాలు
ప్రజాక్షత్ర్, తెలంగాణ బ్యూరో
టీపీసీసీ అధ్యక్షులుగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియమితులైనారు. ఈ మేరకు ఆయనను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. మహేష్‌కుమార్ గౌడ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, ఎంఎల్ సి బి. మహేష్ గౌడ్‌కు అరుదైన గౌరవం దక్కిందని కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటి వరకు టీపీసీసీ అధ్యక్షులుగా కొనసాగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పార్టీ అధిష్ఠానం అభినందించింది. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులుగా నియమితులైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నాపై అత్యంత నమ్మకం తో నాకు కీలకమైన టీపీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, పార్లమెంట్ ప్రతి పక్ష నాయకులు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సి వేణుగోపాల్, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ ముంన్షి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులకు, ఎంపీ లకు, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యే లకు, డీసీసీ అధ్యక్షులకు, పార్టీ కోసం అనునిత్యం పాటు పడుతున్న నాయకులకు, కార్యకర్తలకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్‌గౌడ్ మాట్లాడుతూ పార్టీ అప్పగించిన ఈ గొప్ప బాధ్యతలను చిత్తశుద్ధి తో అంకిత భావంతో పని చేసి పార్టీని మరింత బలోపేతం చేస్తానన్నారు. నిరంతరం కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటూ పార్టీ కి, ప్రభుత్వానికి అనుసంధానం గా పని చేసి రాష్ట్రాభివృద్ధికి, పార్టీ పటిష్ఠతకు కృషి చేస్తానన్నారు. ఇంతకాలం నాకు అన్ని రకాలుగా సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు.