ఢిల్లీ బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు చేయండి - మంత్రి కొండా సురేఖ ను కోరిన లాల్ దర్వాజా ఆలయ కమిటీ

ఢిల్లీ బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు చేయండి -  మంత్రి కొండా సురేఖ ను కోరిన లాల్ దర్వాజా ఆలయ కమిటీ

ఢిల్లీ బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు చేయండి -

మంత్రి కొండా సురేఖ ను కోరిన లాల్ దర్వాజా ఆలయ కమిటీ

ప్రజా క్షేత్ర్, చార్మినార్ :

దేశ రాజధాని ఢిల్లీ తెలంగాణ భవన్ లో మూడు రోజుల పాటు ఈ నెల 30 జులై 1,2 తేదీల లో నిర్వహిస్తున్న లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ను లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం కమిటీ కోరింది.దేవాలయం చైర్మన్ బి.మారుతీ యాదవ్,మాజీ ఛైర్మన్ కె. వెంకటేష్ ,కోశాధికారి ఎ.చంద్ర కుమార్ తదితరులతో కూడిన ప్రతినిధి బృందం మంగళవారం మంత్రిని జూబ్లీహిల్స్ లోని ఆమె నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలను దేశ ప్రజలకు తెలిపే ఉద్దేశంతో ఢిల్లీ తెలంగాణ భవన్ లో గత పది సంవత్సరాల నుండి బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం ఇంకా పెద్దఎత్తున బోనాల ఉత్సవాలను నిర్వహించేందుకు ఆలయ కమిటీ తో పాటు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఢిల్లీలో నిర్వహించే బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి ఆలయ కమిటీ వారికి హామీ ఇచ్చారు.