తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ప్రకటన : బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా ప్రభాస్ 'కల్కి'.. బెస్ట్ యాక్టర్‌గా బన్నీ
తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ప్రకటన -
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా ప్రభాస్ 'కల్కి'.. బెస్ట్ యాక్టర్‌గా బన్నీ
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ :
తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించింది. ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజుతో కలిసి జ్యూరీ ఛైర్ పర్సన్ జయసుధ మీడియా సమావేశంలో అవార్డులు ప్రకటించారు. 2024 ఏడాదికి సంబంధించి.. ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా.. ప్రభాస్ 'కల్కి 2898 ఏడి' మూవీ నిలిచింది. అలాగే సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ 'పొట్టేల్', థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ 'లక్కీ భాస్కర్' పురస్కారాలు అందుకున్నాయి.మొత్తం 1,248 నామినేషన్లను కమిటీ పరిశీలించింది. వ్యక్తిగత కేటగిరీలో 1,172.. ఫీచర్ ఫిల్మ్ డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్ వంటి ఇతర విభాగాల్లో 76 అప్లికేషన్స్ వచ్చాయి.
14 ఏళ్ల తర్వాత..
దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ అవార్డులను ప్రకటించారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకూ ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి.. సెన్సార్ అయిన చిత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు.
2024కు సంబంధించి అన్నీ కేటగిరీల్లోనూ అవార్డులు ఇచ్చారు. ఉత్తమ నటుడు, దర్శకుడు సహా మొత్తం 21 మందికి వ్యక్తిగత, స్పెషల్ జ్యూరీ అవార్డులు ఇచ్చారు. తెలుగుతో పాటు ఉర్దూ చిత్రాలకూ అవార్డుల్లో
ప్రాధాన్యత ఇచ్చారు. వీటితో పాటే ఎన్టీఆర్, బీఎన్ రెడ్డి, పైడి జయరాజు, నాగిరెడ్డి చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య పేర్లలో స్పెషల్ అవార్డులు ప్రకటించారు. 'పుష్ప 2' సినిమాకు అల్లు అర్జున్‌కు ఉత్తమ
నటుడిగా అవార్డు వరించింది. అలాగే ఉత్తమ నటిగా నివేదా థామస్.. '35 ఇది చిన్న కథ కాదు' మూవీకి పురస్కారం అందించారు.
అవార్డుల జాబితా ఇదే..
ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ - కల్కి 2898 ఏడీ
సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ - పొట్టేల్
మూడో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ - లక్కీ భాస్కర్
జాతీయ సమైక్యత, మత సామరస్యం, సామాజిక అభ్యున్నతిపై బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ - కమిటీ కుర్రాళ్లు
ఉత్తమ ప్రజాదరణ చిత్రం - ఐ అండ్ మై ఫ్రెండ్స్
హిస్టరీ విభాగంలో ఫీచర్ హెరిటేజ్ మూవీ - రజాకార్
ఉత్తమ బాలల చిత్రం - 35 ఇది చిన్న కథ కాదు
ఉత్తమ పరిచయ దర్శకుడు - యధువంశీ (కమిటీ కుర్రాళ్లు)
వ్యక్తిగత విభాగాల్లో..
బెస్ట్ యాక్టర్ - అల్లు అర్జున్ (పుష్ప 2)
బెస్ట్ యాక్ట్రెస్ - నివేదా థామస్ (35 ఇది చిన్న కథ కాదు)
బెస్ట్ డైరెక్టర్ - నాగ్ అశ్విన్ (కల్కి)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ - SJ సూర్య (సరిపోదా శనివారం)
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ - శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ - భీమ్స్ సిసిరోలియో (రజాకార్)
బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్ - సిద్ శ్రీరామ్ (ఊరుపేరు భైరవకోన - నిజమే చెబుతున్న సాంగ్)
బెస్ట్ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ - శ్రేయ ఘోషల్ (పుష్ప 2 - సూసీకి సాంగ్)
బెస్ట్ కమెడియన్ - సత్య, వెన్నెల కిషోర్ (మత్తు వదలరా)
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ - మాస్టర్ అరుణ్ దేవ్ (35 ఇది చిన్నకథ కాదు) మాస్టర్ హారిక (మెర్సీ కిల్లింగ్)
బెస్ట్ స్టోరీ రైటర్ - శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
బెస్ట్ స్క్రీన్ ప్లే - వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
బెస్ట్ లిరిసిస్ట్ - చంద్రబోస్ (రాజు యాదవ్)
బెస్ట్ సినిమాటోగ్రాఫర్ - విశ్వనాధ్ రెడ్డి (గామి)
బెస్ట్ ఎడిటర్ - నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
బెస్ట్ ఆడియోగ్రాఫర్ - అరవింద్ మీనన్ (గామి)
బెస్ట్ కొరియోగ్రాఫర్ - గణేష్ మాస్టర్ - దేవర - ఆయుధ పూజ సాంగ్
బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ - అధినితిన్ జిహాని చౌదరి (కల్కి)
బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ - చంద్రశేఖర్ రాథోడ్ (గ్యాంగ్ స్టర్)
బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ - నల్ల శీను (రజాకార్)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ - అర్చన రావు, అజయ్ కుమార్ (కల్కి)
స్పెషల్ జ్యూరి అవార్డు(హీరో) - దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)
స్పెషల్ జ్యూరి అవార్డు (హీరోయిన్) - అనన్య నాగళ్ళ (పొట్టేల్)
స్పెషల్ జ్యూరి అవార్డు (డైరెక్టర్) - సుజీత్, సందీప్ (క)
స్పెషల్ జ్యూరి అవార్డు (నిర్మాత) - ప్రశాంతి రెడ్డి, రాజేష్ కళ్లేపల్లి (రాజు యాదవ్)
జ్యురి స్పెషల్ మెన్షన్ (సింగర్) - ఫారియా అబ్దుల్లా (ర్యాప్ సాంగ్ - మత్తు వదలరా)
బెస్ట్ బుక్ ఆన్ సినిమా - మన సినిమా ఫస్ట్ రీల్ (రెంటాల జయదేవ్)