నిపుణులు నివేదిక ఇచ్చినా సిఎం రేవంత్ రెడ్డి మొద్దునిద్ర వీడట్లేదు: కెటిఆర్

నిపుణులు నివేదిక ఇచ్చినా సిఎం రేవంత్ రెడ్డి మొద్దునిద్ర వీడట్లేదు: కెటిఆర్

నిపుణులు నివేదిక ఇచ్చినా సిఎం రేవంత్ రెడ్డి మొద్దునిద్ర వీడట్లేదు:
కెటిఆర్
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 27 :
 మంజీరా బ్యారేజీ విషయంలో నిపుణులు నివేదిక ఇచ్చినా సిఎం రేవంత్ రెడ్డి మొద్దునిద్ర వీడట్లేదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. మంజీరా ఆఫ్రాన్ కొట్టుకు పోయిందని, స్పిల్ వే దెబ్బతిందని తెలిపారు. కాంగ్రెస్ సర్కారు చేతకాని తనంతో మంజీరా బ్యారేజీ ప్రమాదంలో పడిందని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..మార్చి 22 న నిపుణులు మంజీరా బ్యారేజీని   సందర్శించారని, మంజీరా దిగువ భాగంలో పిల్లర్లకు పగుళ్లు వచ్చాయని తెలియజేశారు. పిల్లర్లు, ఆఫ్రాన్, స్పిల్ వే పై నిపుణుల బృందం నివేదిక ఇచ్చిందని, మేడిగడ్డ, మంజీరా బ్యారేజీలను వెంటనే రిపేర్ చేయించాలని చెప్పారు. మంజీరాపై కాంగ్రెస్, బిజెపి నేతలు స్పందించకపోవడం దారుణమని కెటిఆర్ పేర్కొన్నారు.