పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం... తల్లీ, కొడుకు మృతి
కూతురును కాపాడిన గ్రామస్తులు
పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం
తల్లీ, కొడుకు మృతి
కూతురును కాపాడిన గ్రామస్తులు
ప్రజా క్షేత్ర్, పెందుర్తి :
విశాఖ పెందుర్తిలో విషాదం చోటు చేసుకుంది. సత్తివానిపా లెంలో కుటుంబ కలహాలతో కొడుకు, కూతురుతో కలిసి ఓ తల్లి బావిలో దూకింది. ఈ ఘటనలో తల్లి, కుమారుడు మృతి చెందారు. కూతురు ప్రాణాలతో బయటప డింది. స్థానికులు కాపాడి ఆసుప త్రికి తరలించారు. సత్యవాణిపాలెం గ్రామానికి చెందిన కొల్లు పవన్, గీత భార్యాభర్తలు. వీరికి కుమారుడు భవిష్యన్ మణికంఠ, కుమార్తె మోక్షశ్రీ లు ఉన్నారు. పవన్ మద్యానికి బానిస అవవడంతో.. గీతతో తరచుగా గొడవలు అయ్యేవి. ఈ క్రమంలో గీత తన ఇద్దరు పిల్లలను బావిలో తోసేసి అనంతరం ఆమె కూడా దూకింది. ఈ ఘటనలో గీత, మణికంఠ మృతి చెందారు. మోక్షశ్రీ బావిలో మెట్టును పట్టుకొని ఉండటంతో ప్రాణాలతో బయటపడింది. గ్రామస్తులు మోక్షశ్రీ కాపాడారు. విషయం తెలుసుకున్న పెందుర్తి సీఐ సతీశ్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.