బండి సంజయ్‌కు సిట్ నోటీసులు...కాంగ్రెస్ రాజకీయ వ్యూహమా?

బండి సంజయ్‌కు సిట్ నోటీసులు...కాంగ్రెస్ రాజకీయ వ్యూహమా?

బండి సంజయ్‌కు సిట్ నోటీసులు...కాంగ్రెస్ రాజకీయ వ్యూహమా?
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్,జూన్ 24  :
ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసుల విచారణ బీఆర్ఎస్ ముఖ్య నేతలనే లక్ష్యంగా చేసుకుని సాగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి, ఈ కేసును విచారిస్తున్న సిట్ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. గతంలో బండి సంజయ్ స్వయంగా తన ఫోన్‌ను నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో, ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసులో ఆయన్ను బాధితుడిగానూ, ఓ సాక్షిగానూ విచారించాలని సిట్ నిర్ణయించింది. అయితే, ఈ నోటీసులు జారీ వెనుక బలమైన రాజకీయ వ్యూహం కూడా దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది పక్కా కాంగ్రెస్ మార్క్ రాజకీయంగా చెబుతున్నారు.