రూ. 200 కోట్లు ఖర్చు ఎక్కడ అయ్యాయో చెప్పాలి ఖర్చు అయినట్లు నిరూపించాలని.. లేదంటే ముక్కు నెలకు రాయాలి.. కేటీఆర్, హరీష్‌రావులకు మంత్రి పొన్నం సవాల్!..

రూ. 200 కోట్లు ఖర్చు ఎక్కడ అయ్యాయో చెప్పాలి  ఖర్చు అయినట్లు నిరూపించాలని.. లేదంటే ముక్కు నెలకు రాయాలి.. కేటీఆర్, హరీష్‌రావులకు మంత్రి పొన్నం సవాల్!..

రూ. 200 కోట్లు ఖర్చు ఎక్కడ అయ్యాయో చెప్పాలి
 ఖర్చు అయినట్లు నిరూపించాలని.. లేదంటే ముక్కు నెలకు రాయాలి
కేటీఆర్, హరీష్‌రావులకు మంత్రి పొన్నం సవాల్..
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్ జూన్ 3 :
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్‌రావులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. వారు చెప్పిన టైమ్‌కు చర్చకు ఎక్కడికైనా వస్తానని దీనికి వారం రోజుల సమయం ఇస్తున్నానని.. ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు వారు రావాలని మంత్రి అన్నారు.తెలంగాణ ఖ్యాతి ఖండాంతరాలు దాటుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే విపక్షాలు పిల్లి శాపనార్థాలు పెడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్   మండిపడ్డారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన సెక్రటేరియట్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. అంతర్జాతీయ అతిథులు రాష్ట్రానికి వస్తే విమర్శలు చేయడం తగదని అన్నారు. బీఆర్ఎస్ నేతలు   కేటీఆర్  హరీష్‌రావు  లకు సవాల్ చేస్తున్నా.. దీనిపై చర్చకు ఎక్కడకు రావాలి.. తెలంగాణ భవన్‌కు రావాలా? అబిడ్స్ చౌరస్తాకు రావాలో చెప్పాలన్నారు. రూ. 200 కోట్లు ఖర్చు ఎక్కడ అయ్యాయో చెప్పాలని.. ఖర్చు అయినట్లు నిరూపించాలని.. లేదంటే ముక్కు నెలకు రాయాలని మంత్రి సవాల్ చేశారు.
వారం రోజులు టైమ్ ఇస్తున్నా...
కేటీఆర్, హరీష్‌రావు చెప్పిన టైమ్‌కు చర్చకు ఎక్కడికైనా వస్తానని దీనికి వారం రోజులు సమయం ఇస్తున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు వారు రావాలని మరోసారి ఆయన సవాల్ చేశారు.