లోహ విజ్ఞాన౦ పై వూట్జ్ ది ఫర్గాటెన్ మెటల్ క్రాఫ్ట్ ఆఫ్ డెక్కన్ గ్రంధం ఆవిష్కరణ

లోహ విజ్ఞాన౦ పై వూట్జ్ ది ఫర్గాటెన్ మెటల్ క్రాఫ్ట్ ఆఫ్ డెక్కన్ గ్రంధం ఆవిష్కరణ

లోహ విజ్ఞాన౦ పై వూట్జ్ ది ఫర్గాటెన్ మెటల్ క్రాఫ్ట్ ఆఫ్ డెక్కన్ గ్రంధం ఆవిష్కరణ
* అత్యంత నాణ్యమైన ఉక్కు లోహం కూడా ఉత్పత్తి లో తెలంగాణ అగ్రగామీ
* గ్రందాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనా చారి
ప్రజా క్షేత్ర్,  హైదరాబాద్ జూన్ 5 :
లోహ విజ్ఞాన౦ పై రూపొందించిన  డా, శ్రీపెరుందురు జైశంకర్ రాసిన వూట్జ్ ది ఫర్గాటెన్ మెటల్ క్రాఫ్ట్ ఆఫ్ డెక్కన్ గ్రంధం ఆవిష్కరణ పబ్లిక్ గార్దేన్ లలితా కళాతోరణం లో గురువారం జరిగింది . జాతీయ విశ్వకర్మ ఎంప్లాయిస్, ప్రొఫెషనల్స్ అసోషియేషన్ జాతీయ  అధ్యక్షులు ఏ. పద్మాచారి అధ్యక్షతన జరిగిన ఆధ్వర్యంలో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, దాసోజు శ్రవణ్ లు ముఖ్య అతిధులుగా హాజరయి పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మధుసుదనాచారి మాట్లాడుతూ   "ప్రపంచంలో అత్యంత నాణ్యమైన కత్తుల తయారీకి ప్రధాన కేంద్రం డమాస్కస్. అయితే, ఈ కత్తుల తయారీకి తెలంగాణలో ఉత్పత్తయ్యే ఉక్కును డమాస్కస్ దిగుమతి చేసుకునేది. పైగా, ఒక ముద్ద ఉక్కు కు పది రేట్ల బంగారు ముద్దలను మన తెలంగాణా ఉక్కు తయారీ దారులకు అందచేసే వారట. ఆరువేల సంవత్సరాలకు పూర్వమే తెలంగాణలో ప్రపంచంలోనే అత్యంత మేలు రకమైన ఉక్కు తయారీ కావడంతోపాటు ప్రపంచంలోని పలు దేశాలకు ఎగుమతి చేసేవారట" ఈ అంశాలతోపాటు  ఎంతో విలువైన సమాచారాన్ని వూట్జ్ ది ఫర్గాటెన్ మెటల్ క్రాఫ్ట్ ఆఫ్ డెక్కన్ అనే గ్రంధంలో పేర్కొన్నారు. తెలంగాణా కేవలం సాంస్కృతికంగా, చారిత్రకంగా ఉన్నత చరిత్ర కలిగిన తెలంగాణలో అత్యంత నాణ్యమైన ఉక్కు లోహం కూడా ఉత్పత్తి చేసేదని ఆధారాలతో సహా రూపొందించిన ఈ పుస్తకం మంచి పరిశోధనా గ్రంధం గా ఉపయోగపడుతుందని అన్నారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, ప్రస్తుత నిచ్చెనమెట్ల సమాజంలో అద్భుత కళాకారులుగా, నిర్మాణ ప్రతిభ వున్నా విశ్వబ్రాహ్మలు శూద్రులుగా విభజించబడి అణగారిన కులాలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజానికి నాగరికత నేర్పిన విశ్వ బ్రాహ్మణుల గొప్పతనంపై ఈ గ్రంధంలో అద్భుతంగా పేర్కొన్నారని అన్నారు. గ్రంథ రచయిత శ్రీపెరంబుదూరు జైకిసాన్ తెలంగాణాలో ఉక్కు లోహ పరిశ్రమ పరిణామంపై వివరించారు.  ఆంగ్లంలో వూట్జ్ అని పిలిచే ఉక్కును భారత దేశంలో అత్యంత పదునైన ఆయుధాలు తయారు చేయడానికి ఉపయోగించేవారు. ఈలోహం అధిక కర్బనం కలిగిఉంటుంది. ఇది, ఇనుములాగా మెత్తనైనా లోహం కాదు. ఇనుప ముక్కలను అతి ఉష్టోగ్రత దగ్గర కరిగించి కర్బనం జోడించి ఉక్కుగా తయారు చేస్తారు. దీనితోనే కత్తులు, చాకులు, పదునైన ఆయుధాల తయారీకి ఉపయోగించేవారు. ఈ ఉక్కును గుజరాత్ లోని క్యాచ్ ఓడరేవుద్వారా పర్షియన్ జలసంధి మీదుగా డమాస్కస్ కు రవాణా చేయబడి సిరియాలో ఆయుధాలు తయారు చేసేవారు. కచ్ మీదుగా ఎగుమతి చేసినందున ఈ లోహాన్ని కచ్చి లోగా పిలిచే వారట. 1750 లో డమాస్కస్ లో మన లోహంతో కత్తులు, ఆయుధాల తయారీ నిలిచిపోయిందని ఈ గ్రంధంలో సవివరంగా తెలిపారు.మహమ్మద్ ప్రవక్త వాడిన ఖడ్గాన్ని 'మొహాన్నద్' అని పిలిచేవారు. మొహాన్నది అంటే మంచి భారతదేశం ఉక్కుతో తయారుచేసిన ఖడ్గమని అర్ధం. ఇక, మనదేశంలో గుప్తుల కాలం క్రీ.శ. 400 లో నిర్మించిన ఢిల్లీ ఇనుప స్తంభం, ఒర్రిస్సాలోని కోణార్క్ దేవాలయం లో సుమారు 50  నుండి 60 టన్నుల బరువైన దాదాపు 60 ఇనుప స్తంబాలు, ఇప్పటికీ కానవచ్చే ఎన్నో ఫిరంగులు తుప్పుపట్టకుండా ఉంది మన పూర్వీకుల లోహ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.     *Wootz The Forgotten Metal Craft of  Deccan అనే ఈ పుస్తకంలో మొదటి అధ్యాయంలో తెలంగాణ సంక్షిప్త చరిత్ర, ఈ ప్రాంతంలోని ఉక్కు భౌతిక సంస్కృతీ, వివిధ ప్రాంతాల్లో తుప్పుపట్టని  ఉక్కు స్తంబాలు, ఫిరంగులు, విశ్వా కర్మల వృత్తి నైపుణ్యం తదితర అంశాల గురించి వివరించారు. రెండు అధ్యాయంలో తెలంగాణాలో పెద్ద రాతి సమాధుల యుగంగురించి, క్రీ.పూ. 6 వేలసంవత్సరాల నాడు ఇక్కడ కనిపించే ఇనుప సంస్కృతిని వివరించారు. మూడవ అధ్యాయంలో తెలంగాణలో అధికంగా ఉక్కు ఆధారిత వస్తువులు తయారయ్యే గ్రామాలు, చిన్న పట్టణాల గురించి వివరించారు. కర్ణాటక, తమిళ నాడు, తెలంగాణా లో ఉక్కు తయారీలో తేడాలున్నాయని, తెలంగాణలో ఉక్కు తయారీలో ఉక్కు ముద్దలకు 1 % నుండి 2 % కార్బనం కలిపేవారు. ఇతర రాష్ట్రాలల్లో ఇది, 0 .8 % నుండి 1 .2 % కర్బనం కలిపే వారు. అందుకే, తెలంగాణా ఉక్కు అత్యంత ప్రామాణికమైనది.  తెలంగాణా లో ఉక్కు లోహానికి సంబందించిన అనేక అంశాలను తెలియ చేసే ఈ పుస్తకం మెటల్స్ పై పరిశోధన చేసే స్కాలర్స్ కు, పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర విశ్వ భ్రమణ సంగం రాష్ట్ర అధ్యక్షులు వేములవాడ మదన్ మోహన్, సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకట రమణ, హైదరాబాద్ డీఆర్ఓ వెంకటా చారి, రాజేందర్ రెడ్డి, వి. రఘునాధ్,  రఘువీర్ ప్రతాప్, పెందోట శ్రీను, తంగెళ్ల పల్లి రవికుమార్, కిరణ్ కుమార్, బుద్దారం సుధాకర్, శాంతి కృష్ణ, మంజుల, తదితరులు పాల్గొన్నారు.