వాసాల మర్రిని దత్తత తీసుకొని ఆగం చేసిన కేసీఆర్ : మంత్రి పొంగులేటి

వాసాల మర్రిని దత్తత తీసుకొని ఆగం చేసిన కేసీఆర్ : మంత్రి పొంగులేటి

వాసాల మర్రిని దత్తత తీసుకొని ఆగం చేసిన కేసీఆర్ : మంత్రి పొంగులేటి

ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :
మాజీ సీఎం కేసీఆర్ వాసాలమర్రి గ్రామంలో ప్రభుత్వ సొమ్ముతో భోజనం చేసి, గ్రామస్తులకు అబద్ధపు హామీలు ఇచ్చి, తన స్వార్ధ రాజకీయంతో గ్రామస్తులు అందరిని మోసం చేసి వాసాలమర్రిని ఆగం ఆగం చేశారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలోని 227 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన మంత్రికి ప్రభుత్వవిప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గతంలో మాజీ సీఎం కేసీఆర్ తో కలిసి భోజనం చేసిన ఆకుల ఆగవ్వకు ఇందిరమ్మ ఇంటి మొదటి ప్రొసీడింగ్ పత్రాన్ని మంత్రి శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. ఆమెకు ఇంటిని నిర్మించుకోవడానికి లక్ష రూపాయలను స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అందించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 6న సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా వాసాలమర్రిని అభివృద్ధి చేయాలని ఆదేశించినట్లు చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ దత్తత తీసుకుని ఆగం చేసిన వాసాలమర్రిని అభివృద్ధి చేద్దామని రేవంత్ రెడ్డి చెప్పినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే వాసాలమర్రి గ్రామంలో పేదోడి చిరకాల కోరిక అయిన సొంతింటి కల సాకారం చేశామన్నారు. కేసీఆర్ ఆగం చేసిన వాసాలమర్రిని రేవంత్ ఆదుకుంటున్నాడని చెప్పారు. ఆగవ్వకు అన్నం పెట్టి వాసాలమర్రిని రోల్ మోడల్ గా చేస్తా అని కేసీఆర్ మాటిచ్చి ఆగం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మలు చూపించుకుని ఓట్లు వేయించుకున్నాడే తప్ప ఒక్క ఇల్లు కూడా కట్డించలేదని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ రూ. 8.19 లక్షల కోట్లు అప్పు చేశాడని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతినెల రూ. 6500 కోట్లు అసలు, వడ్డీ కడుతుందని చెప్పారు. ఆర్థిక భారం మీద పడుతున్న భరిస్తూ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ పోతున్నామన్నారు. గ్యాస్, కరెంటు, ఉచిత ఆర్టీసీ, రాజీవ్ ఆరోగ్య శ్రీ, పేదోడికి సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు. పదేళ్లు పాలించిన కేసీఆర్ ఎందుకు ఇవన్నీ చేయలేకపోయాడని ప్రశ్నించారు. ఇందిరమ్మ ప్రభుత్వమంటేనే ఇందిరమ్మ ఇండ్లని, పేదోడి కలను నిజం చేయడం కోసం ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నామన్నారు. రూ.22 వేల 500 కోట్లతో రాష్ట్రంలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను కట్టిస్తున్నామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదోడి కలను నెరవేర్చుతున్నామని చెప్పారు. ధరణితో ఇబ్బంది పడ్డ రైతులను ఆదుకోవడం కోసం భూభారతి చట్టం తెచ్చామని అన్నారు. ధరణి తెచ్చిన కేసీఆర్ భూములను ఖతం చేసిండని చెప్పారు. భూసమస్యల పరిష్కారం కోసం అధికారులే ఊర్లలోకి వచ్చి సమస్యలు తీర్చుతున్నామని, భూభారతి చట్టం ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తుందన్నారు. ఆగస్టు లోపు భూసమస్యలు మొత్తం పరిష్కరిస్తామని, పేదోడి కష్టాలను తీర్చడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నామని, ఆలస్యమైనా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. తప్పును ఒప్పుగా.. ఒప్పును తప్పుగా చేసి పదేళ్లు రాష్ట్రాన్ని ఆగం చేసిన కేసీఆర్.. మళ్లీ ప్రజలకు నమ్మించి మోసం చేయడానికి పన్నాగాలు పన్నుతున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. రాష్ట్రంలో సర్వేయర్ల వ్యవస్థను భలోపేతం చేయడానికి లైసెన్స్ డ్ ఆరు వెల సర్వేయర్లను తీసుకువస్తున్నామన్నారు.

 కేసీఆర్ వల్లకాడు చేసిన వాసాలమర్రిని బాగు చేస్తాం.. బీర్ల అయిలయ్య

కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రిని ఆయన వల్లకాడు చేశాడని, ఆ గ్రామాన్ని బాగు చేస్తామని బీర్ల అయిలయ్య అన్నారు. వాసాలమర్రి ప్రజలకు కేసీఆర్ చేసిన గాయాలకు సీఎం రేవంత్ రెడ్డి అయింట్ మెంట్ పెడుతున్నారని, ఫాం హౌస్ కు రోడ్డు కోసం వాసాలమర్రిని కేసీఆర్ వల్లకాడు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.వాసాలమర్రి మాదిరిగానే తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఆగం చేశాడని, వాసాలమర్రిని ఆదుకుంటానని తిర్మలాపూర్ కు వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి ఇవాళ నిజం చేశాడని చెప్పారు.కేసీఆర్ తెచ్చిన ధరణితో రైతులు ఆగమయ్యారని, అందుకే భూభారతి చట్టాన్ని తెచ్చి రైతులకు చుట్టంగా మార్చిన ఘనుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.