29 న తెలంగాణలో పర్యటించనున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా

29 న తెలంగాణలో పర్యటించనున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా

29 న తెలంగాణలో పర్యటించనున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్‌ జూన్ 27 :
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఈ నెల 29 వ తేదీన తెలంగాణలో పర్యటించనున్నారు. ఎల్లుండి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి ఆయన చేరుకోనున్నారు. అక్కడి నుంచి నిజామాబాద్‌కు బయల్దేరతారు. అక్కడ జరిగే వివిధ కార్యక్రమాల్లో అమిత్‌ షా పాల్గొననున్నారు. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అలాగే, బిజెపి ఎంపి ధర్మపురి అరవింద్ తండ్రి, దివంగత కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డి శ్రీనివాస్ విగ్రహాన్ని అమిత్‌ షా ఆవిష్కరించనున్నారు.