వ్యవసాయం, విద్యా రంగాలకు అధిక ప్రాధాన్యత : రేవంత్ రెడ్డి

వ్యవసాయం, విద్యా రంగాలకు అధిక ప్రాధాన్యత : రేవంత్ రెడ్డి

ప్రజా క్షేత్ర్, తెలంగాణ బ్యూరో :

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, 'వరల్డ్ ఫుడ్ ప్రైజ్' అవార్డు గ్రహీత డాక్టర్ సమరేందు మొహంతి , అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ నుంచి (2002) లో ఉత్తమ శాస్త్రవేత్త అవార్డు పొందిన ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ అల్దాస్ జానయ్యలు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో వ్యవసాయ పరిశోధనలు, వ్యవసాయ విధానాల రూపకల్పన, పంటల మార్కెట్ విశ్లేషణ తదితర అంశాలపై మొహంతి, జానయ్య తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రి తో పంచుకున్నారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం వ్యవసాయం, విద్యా రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  స్పష్టం చేశారు.