సిట్ విచారణకు హాజరైన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు..

సిట్ విచారణకు హాజరైన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు..
ప్రజా క్షేత్ర్, హైదరాబాద్:
ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయన సుమారు 14 నెలల తర్వాత అమెరికా నుంచి హైదరాబాద్‌కు చేరకున్నారు. పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ఏ1గా ఉన్నారు. ప్రభాకర్‌రావు నుంచి కీలక సమాచారం రాబట్టాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ప్రణీత్‌రావు, రాధాకిషన్‌రావు, భుజంగరావు, తిరుపతన్నను సిట్ అధికారులు అరెస్టు చేశారు. వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రభాకర్‌రావును ప్రశ్నించనున్నారు.
ప్రభాకర్‌రావు ఈ కేసు నమోదైన సమయంలోనే అమెరికా వెళ్లారు. ఆ తర్వాత తిరిగి రాకపోవడంతో పోలీసులు ఆయన పాస్‌పోర్టు రద్దు చేయించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణకు సహకరించేందుకు ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్‌తో ఆదివారం రాత్రి 8.20 గంటల సమయంలో ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు. ఐజీ స్థాయిలో పదవీ విరమణ చేసిన అధికారి పోలీసు విచారణకు హాజరవుతుండటం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం.