సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జపాన్ కాన్సులేట్ జనరల్ టకాహషి మునియో
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జపాన్ కాన్సులేట్ జనరల్ టకాహషి మునియో
ప్రజాక్షేత్ర్, వెబ్ న్యూస్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జపాన్ కాన్సులేట్ జనరల్ టకాహషి మునియో (Takahashi Muneo) మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చ జరిగింది. చెన్నై కేంద్రంగా పనిచేసే జపాన్ కాన్సులేట్ తెలంగాణతో కొనసాగిస్తోన్న సంబంధాలు, నిర్వహిస్తోన్న కార్యక్రమాలను ఈ సందర్భంగా టకాహషి ప్రస్తావించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి , హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు అధికారిణి(RPO) జొన్నలగడ్డ స్నేహజ , ఇతర అధికారులు పాల్గొన్నారు.