వినాయక చవితి కి కళాత్మక విగ్రహాలు సిద్ధం
వినాయక చవితి కి కళాత్మక విగ్రహాలు సిద్ధం
ప్రజా క్షేత్ర్, వెబ్ న్యూస్ :
శ్రీకాళహస్తి లో వినాయక చవితి సందర్భంగా కళాకారుల కుంచె నుండి చక్కటి రంగులను సింగారించుకున్న కళాత్మక వినాయకుని విగ్రహాలు వినాయక చవితి పండుగకు సిద్ధం అవుతున్నాయి. ఏడాదికి ఒకసారి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో సిద్ధం చేసే విగ్రహాలకు ఎనలేని గిరాకీ ఉన్నది. మట్టి విగ్రహాలు కన్నా ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో సిద్ధం చేసిన రంగు రంగుల వినాయక విగ్రహాలు అంటే శ్రీకాళహస్తి పట్టణ ప్రజలకు,అదేవిధంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఇష్టం. వినాయక చవితి అంటేనే వీధి వీధినా అందమైన ప్రధమ గణాధిపతి వినాయక విగ్రహాలను ప్రతిష్టించడానికి పేద, ధనిక భేదము లేకుండా పోటీ పడుతుంటారు. వినాయక చవితి పండుగకు రకరకాల సైజుల్లో వినాయక ప్రతిమలకు రంగులు అలంకరించి వినాయక విగ్రహాలను విక్రయించటం చాలా ఏళ్లుగా కొనసాగుతూ వస్తుంది. శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్న హౌసింగ్ బోర్డ్ కాలనీ జాతీయ రహదారి ప్రక్కన వినాయక విగ్రహాలు అందరిని ఆకట్టుకునేలా రాజస్థాన్ చెందిన కూలీలు సిద్ధం చేస్తున్నారు